మాట్లాడుతున్న కోటంరెడ్డి
జగన్ జైలుకు వెళ్లడం ఖాయం
- టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి హెచ్చరిక
ప్రజాశక్తి-నెల్లూరు:నేను చెబుతున్న గుర్తు పెట్టుకోండి.. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రావడం.. నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి హెచ్చరించారు. మంగళవారం నగరంలోని టిడిపి జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి రాకూడదని వైసీపీ నేతలు కోరుకోవాలని.. వస్తె మాత్రం అందరి లెక్కలు సరి చేయడం తధ్యమన్నారు. తమ నాయకుడు నారా చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేసిన బంద్ విజయవంతం అయిందన్నారు. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ, వారి కళ్ళు గప్పి ప్రజలు ప్రభుత్వానికి తమ నిరసనలు తెలిపారన్నారు. మమల్ని అడ్డుకునే దమ్ము, దైర్యం ప్రభుత్వానికి లేదని కోటంరెడ్డి విమర్శించారు.. బంద్ ను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు కోటంరెడ్డి కతజ్ఞతలు తెలిపారు.తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని రాజకీయ సైకోలు ఫోన్ చేసి బెదిరిస్తూన్నారని కోటంరెడ్డి అన్నారు. పదే పదే మూడు నంబర్ల నుంచి కాల్స్ వచ్చాయని, తనను దుర్బాశలాడరని ఆయన అన్నారు. అలాంటి సైకో లకు, వారి చేత ఫోన్ చేయించే పిల్ల బచ్చా గాల్లకి భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.. దమ్ముంటే గాంధీ బొమ్మ సెంటర్ కి రావాలని కోటంరెడ్డి మీసం మెలేసి సవాల్ విసిరారు. తన కుటుంబంలో ఉండే మహిళలను కూడా నోటికొచ్చినట్లు బూతులు తిట్టడానికి అవేదన వ్యక్తం చేశారు. ఆ ఫోన్ నంబర్ ని మీడియాకు చూపిస్తూ పోలీసులకు దముంటే ఆ ఫోన్ నెంబర్లను వాడే వారిని అరెస్టు చేయాలన్నారు.స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందని, దొంగ డాక్యుమెంట్స్ సష్టించుకుని, చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. జగన్ 16 నెలలు జైలులో చిప్ప కూడు తిన్నాడని, చంద్రబాబు ను కూడా జైల్లో పెట్టించాలనే అక్రమ అరెస్ట్ కు పాల్పడి రిమాండ్ కి పంపారని మండిపడ్డారు. పార్టీ క్యాడర్ అంతా కొన్ని నెలలు ఓపిక పడితే వడ్డీతో సహా తిరిగి చెల్లిద్దామని కోటంరెడ్డి అన్నారు. ఈ సమవేశంలో మాజీ కార్పొరేటర్ ఉచ్చిభువనేశ్వర ప్రసాద్,కప్పిర శ్రీనివాసులు పుట్ట అజరు రెడ్డీ,కువరపు బాలాజీ,పెంచిల్ చౌదరి,అంచురు శ్రీనివాసులునాయుడు, మొయుదిన్ తదితరులు పాల్గొన్నారు










