Oct 26,2023 20:35

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వినికి పుష్ఫగుచ్చం ఇస్తున్న కోళ్ల లలితకుమారి

ప్రజాశక్తి- శృంగవరపుకోట 
ఆనాడు జగన్‌ ఎన్నికల ప్రచారంలో కోడి కత్తి డ్రామా నడిపించారని నియోజకవర్గం ఇంఛార్జి కోళ్ల లలిత కుమారి ఆరోపించారు. గురువారం పట్టణంలోని అన్న క్యాంటీన్‌ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కోడి కత్తి డ్రామా జరిగి ఐదేళ్లు పూర్తయిందని గుర్తు చేశారు. కోడి కత్తి కేసులో నిందితుడుగా ఉన్న శ్రీను నేటికీ విచారణ ఖైదీగానే జైల్లోనే మగ్గుతున్నారని అన్నారు. జగన్‌ విచారణకు రావాలని కోర్టు ఆదేశించిన ఆన్‌లైన్‌ ద్వారా హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలంటూ ఆయన తరపు పిటిషన్‌ చేయడం అత్యంత హాస్యాస్పదంగా ఉందన్నారు. వైసిపి నాయకులు చంద్రబాబు, లోకేష్‌, భువనేశ్వరిలపై నచ్చినట్లు మాట్లాడడం మాని, ముందు మీ నాయకుడిని కోడి కత్తి కేసులో కోర్టులో హాజరైతే అన్ని తేలుతాయని హితవు పలికారు. కాకినాడలో దళిత యువకుడి హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్టయ్యారు కానీ అరు నెలలలోపే బయటికి వచ్చారన్నారు. వైయస్‌ వివేకా హత్య కేసులో ఎంపి అవినాష్‌ రెడ్డి అరెస్ట్‌ అయిన ఐదు నిమిషాల్లో బెయిల్‌ పొందారన్నారు. కానీ ఏ ఆదారాలు లేకుండా ప్రజా నాయకుడు చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి 50 రోజులుకి పైగా జైలుకే పరిమితం చేసి కనీస సదుపాయాలు కుడా కల్పించకుండా ఇబ్బందులపాలు చేయడం దుర్మార్గపు చర్య అని అన్నారు. భువనేశ్వరి తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళితే, జబర్దస్త్‌ రోజా కుప్పిగంతులేస్తుందన్నారు. మీ నాయకుడు పై ఆధారాలతో కూడిన కేసులు ఉన్నాయని బెయిల్‌ పై అధికారాన్ని అడ్డుపెట్టుకుని బయట ఉన్నాడని గుర్తు చేశారు. ఈ సమావేశంలో టిడిపి మండల అధ్యక్షులు జిఎస్‌ నాయుడు, భీశెట్టి అరుణ, అనకాపల్లి చెల్లయ్య, కాపుగంటి వాసు, బంగారమ్మ, భీశెట్టి మొహాన్‌, తదితరులు పొల్గొన్నారు.
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కలిసిన కోళ్ల
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వినిని విజయనగరంలోని తన స్వగృహంలో ఎస్‌కోట నియోజకవర్గం ఇంచార్జి కోళ్ల లలిత కుమారి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు అరెస్టును జనసేన పార్టీ వ్యతిరేకిస్తున్నందున యశస్వినికి కోళ్ల లలిత కుమారి పుష్పగుచ్చాన్ని అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ ఇర్ర వెంకటలక్ష్మి, అలమండ రాంబాబు, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ జనరల్‌ సేక్రటరి భూమీరెడ్డి మోహాన్‌ రాజు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


దశల వారీ మద్యపానం ఎక్కడ

వేపాడ: దశల వారీగా మద్య పాన నిషేదం విధిస్తామన్న జగన్మోహన్‌రెడ్డి ఎందుకు ఆ పనిచేయడం లేదని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ అన్నారు. మండల కేంద్రంలో ఆయన గురువారం విలేకర్లతో మాట్లాడుతూ ఎపికి మద్యం సరఫరా చేస్తున్న యజమానుల జాబితా ఇవ్వలగరా అని ప్రశ్నించారు. 74 శాతం మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే చేస్తున్నాయని ఇందులో భాగంగా అదాన్‌ డిస్టరీస్‌ 2019లో ప్రారంభించారని గుర్తు చేశారు. రూ.1164 కోట్లు మేర మద్యం సరఫరా ఆర్డర్‌ అదాన్‌ కంపెనీ చేస్తుందన్నారు. ఈ కంపెనీకి వెనుక విజయ సాయి రెడ్డి ఉన్నారని ఆరోపించారు. చింతకాయల రాజేష్‌, పి మహేష్‌కు చెందిన సంస్థలను కూడా బలవంతంగానే ఆదాన్‌ చేజిక్కించుకున్నాడని ఆరోపించారు. ఎస్‌వివై ఆగ్రో సంస్థకు రూ. 1800 కోట్లు మేరా సరఫరా చేస్తున్న ఆర్డర్స్‌ ఉన్నాయని ఈ సంస్థ వెనుక ఎంపి మిధున్‌ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో పేర్ల డిక్షనరీస్‌ను సీఎం జగన్మోహన్‌ రెడ్డి సన్నిహితులు బలవంతం పెట్టి సబ్‌ లీజుకు చేసుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసే కంపెనీల జాబితాను కంపెనీల ఓనర్ల జాబితాను ఇవ్వాలని పలుమార్లు టిడిపి నాయకుల కోరినప్పటికీ నేటి వరకు ఇవ్వలేదన్నారు. దమ్ముంటే ఇప్పటికైనా ప్రభుత్వానికి మద్యం సరఫరా చేస్తున్న కంపెనీల జాబితాను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.