
ప్రజాశక్తి-గిద్దలూరు
5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించే ''బాబు ష్య్యూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ'' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ గిద్దలూరు టిడిపి ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానున్న ''బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ'' కార్యక్రమంలో ప్రతీ తెలుగుదేశం కార్యకర్త మినీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రతీ ఒక్కరికి తెలియచెప్పాలన్నారు. పూర్ టూర్ రిచ్ వంటి పథకాల పట్ల అన్నీ వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి రాజ్యాంగ వ్యతిరేక పాలన చేస్తున్నాడని ఓటమి భయంతోనే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారని, జగన్ చేస్తున్న దుర్మార్గాలను ప్రతీ గ్రామంలో ప్రజలకు వివరించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, తెలుగుదేశం పార్టీ గిద్దలూరునియోజకవర్గంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావటం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు జడ్పీటీసీ సభ్యులు బుడతా మధు సూధన్ యాదవ్, ఆరు మండలాల అధ్యక్షులు, సర్పంచులు, ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇన్‌ఛార్జీలు, యూనిట్ ఇన్‌ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.