ప్రజాశక్తి - పర్చూరు
తప్పు చేసిన వారు ఎంత పెద్ద వారైనా శిక్షపడక తప్పదని బాపట్ల జిల్లా మైనారిటి సెల్ కార్యదర్శి గడ్డం మస్తాన్ వలి అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు హస్తం ఉందని సిఐడి నిరూపించిందన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన శనివారం మాట్లాడారు. ఈ స్కాంలో గంటా శ్రీనివాసరావు కుమారుడితో పాటు అచ్చం నాయుడి హస్తం కూడ ఉందని ఆరోపించారు. సమావేశంలో అడపా సుధాకర్ రెడ్డి, మైలా చిన్న నాగేశ్వరరావు, కోటా శ్రీనివాసరావు, తులసి నాగమణి, పఠాన్ కాలేష వలి, గాదే సురేష్, పి ప్రకాష్, వొగ్గిశెట్టి ప్రసాద్, దండా చౌదరి, ఎర్రాకుల తిరుమలేశ్వర్రావు, చిన్ని, జంగా అనిల్, వెంకట్రావు పాల్గొన్నారు.










