
ప్రజాశక్తి - చెరుకుపల్లి
భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్ర ఆధారంగా బాబూజీ అనే బయోపిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రముఖ సినీ దర్శకుడు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు దోనేపూడి దిలీప్ రాజా తెలిపారు. స్థానికంగా మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిలీప్ రాజా మాట్లాడారు. జగజ్జీవన్ రాంగా రత్న ప్రసాద్ (మిలటరీ ప్రసాద్) నటిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు గ్రామీణ ప్రాంత నేపథ్యంలో చెరుకుపల్లి పరిసర ప్రాంతాల్లో నిర్మించేందుకు సన్నాహకాలు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు చెరుకుపల్లి పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. 2024 సంవత్సరం జనవరి నెలలో సినిమా నిర్మాణం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తాను గతంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బయోపిక్ నిర్మించగా దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందిందని తెలిపారు. సమావేశంలో జగజ్జీవన్ రాంగా నటిస్తున్న రత్నప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.