Apr 06,2023 00:53
ఇంకొల్లులో జరిగిన జగ్జీవన్‌రామ్‌ జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి

ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్‌: డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయ సాధనకు యువత కృషి చేయాలని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పిలుపునిచ్చారు. ఇంకొల్లు సినిమాహాలు సెంటర్‌లోని జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆటో నగర్‌లో పర్యటించారు. ఇంకొల్లులోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గంగవరంలో ఎన్టీఆర్‌ విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. గ్రామానికి చెందిన ముస్లి మైనార్టీ నాయకులు షేక్‌ అబ్దుల్‌ నబీ మృతి చెందగా కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాయుడు హనుమంతరావు, మాజీ సర్పంచ్‌ డాక్టర్‌ బోడాల శ్యాంసుందర్‌, వలేరు మార్కు, బేతపూడి సురేష్‌, షేక్‌ రఫీ, వీరగంధం ఆంజనేయులు, గుంజి వెంకట్రావు, పి చంద్రశేఖర్‌, కరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
అద్దంకి: భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్‌ రామ్‌ జయంతి కార్యక్రమం అద్దంకి పట్టణంలోని పోతురాజుగండిలో గల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వలపర్ల సుబ్బారావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల పార్లమెంట్‌ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నాగినేని రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే కులమత భేదాలను, అస్పృశ్యతను విభేదిస్తూ జగ్జీవన్‌రామ్‌ పోరాట పటిమతో అనేక ఉద్యమాలకు ఊపిరి పోశారన్నారు. శాసనసభ్యులు దగ్గర నుంచి మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా పనిచేసి ఆ పదవులకే వన్నెతెచ్చిన మహనీయుడని కొనియాడారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్‌గా ఒక దళిత మహిళా నేతను గౌరవించిన పార్టీ తెలుగుదేశమేనన్నారు. ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం నాడు చంద్రబాబు ఇన్నోవాలు, జేసీబీలు, ఇతర వాహనాలు అందించి 'దళిత తేజం' నలుదిశలా విస్తరించామని పేర్కొన్నారు. నియోజకవర్గ ఎస్సీ సెల్‌ అధ్యక్షులు వలపర్ల సుబ్బారావు మాట్లాడారు. రాష్ట్రంలో సైకో జగన్‌ పోవాలి సైకిల్‌ పాలన రావాలని నేతలు పేర్కొన్నారు.
రేపల్లె: మహనీయుల రాజకీయ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని దళితులు రాజ్యాధికార సాధనకు నడుంబిగించాలని జైభీమ్‌ భారత్‌ పార్టీ రేపల్లె నియోజకవర్గ కన్వీనర్‌, న్యాయవాది దోవా రమేష్‌ రాంజీ పిలుపునిచ్చారు. భారత దేశ మాజీ ఉప ప్రధాని, అభ్యుదయవాది, స్వాతంత్య్ర సమరయోధులు డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని బస్టాండ్‌ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జై భీమ్‌ భారత్‌ పార్టీ బాపట్ల పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ పెనుమాల సుబ్బారావు, రేపల్లె మండల కన్వీనర్‌ కర్ర బాబూరావు, నెరుసు వెంకటరావు, కారుమంచి జయప్రసాద్‌, చెరుకూరి లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.