Mar 31,2023 22:46

ప్రజాశక్తి-జగ్గయ్యపేట : జగ్గయ్యపేట బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా అన్నేపాగ కాంతారావు, బార్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రెటరీగా మెట్టెల వీరాంజనేయులు గెలుపొందారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష పదవికి అన్నేపాగ కాంతారావు అన్నేపాక సుందర్‌ రావు లు పోటీ పడ్డారు. మొత్తం 69 ఓట్లు గాను 68 ఓట్లు పోలయ్యాయి. వీటిలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా అన్నేపాగ సుందరావుపై అన్నేపాగ కాంతారావు 10 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాంతారావుకు 39 ఓట్లు రాగా, సుందరావుకు 29 ఓట్లు వచ్చాయి. జనరల్‌ సెక్రెటరీ పదవికి మెట్టెల వీరాంజనేయులు, యలమంచి నాగ రాజేంద్రప్రసాద్‌ లు పోటీ పడగా వీరిలో వీరాంజనేయులుకు 44 ఓట్లు రాగా, నాగ రాజేంద్రప్రసాద్‌ కు 24 ఓట్లు వచ్చాయి. 20 ఓట్ల మెజార్టీతో వీరాంజనేయులు జనరల్‌ సెక్రెటరీగా గెలుపొందారు. ఈ సందర్భంగా గెలుపొందిన కాంతారావు, వీరాంజనేయులు మాట్లాడుతూ ఈ గెలుపుతో తమకు బాధ్యత పెరిగిందని, న్యాయవాదుల సమస్యలు పరిష్కరించుటకు కషి చేస్తామని తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు ఎలక్షన్‌ ఆఫీసర్లుగా కొల్లి మార్షల్‌ స్టాలిన్‌, జి వెంకటేశ్వర్లు, కె శ్రీనివాసరావు లు వ్యవహరించారు. బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మరియు జనరల్‌ సెక్రెటరీ కాంతారావు, మెట్టెల వీరాంజనేయులుకు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అభినందనలు తెలిపారు.