
ప్రజాశక్తి - కాళ్ల
ఏలూరుపాడు గ్రామ సర్పంచి భూపతిరాజు వెంకట జగ్గరాజు మాతృమూర్తి భూపతిరాజు వెంకట నరసయమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. భూపతిరాజు జగ్గరాజు కుటుంబ సభ్యులను డిసిసిబి ఛైర్మన్ పివిఎల్.నరసింహరాజు శనివారం పరామర్శించారు. వెంకట నరసయమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమెకు ఐదుగురు సంతానం. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు భూపతిరాజు వెంకట జగ్గరాజు గ్రామ సర్పంచిగా పని చేస్తున్నారు. వెంకట నరసయమ్మ మృతికి ఎంపిటిసి సభ్యులు చిన్నాపరపు రాంబాబు, రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి కోశాధికారి మంతెన వెంకట రవివర్మ, మంతెన రామకృష్ణంరాజు, సుదాబత్తుల శివనాగరాజు, దాట్ల రామభద్రిరాజు సంతాపం తెలిపారు.