Oct 08,2023 21:36

ప్రజాశక్తి - కాళ్ల
              ఏలూరుపాడు గ్రామ సర్పంచి భూపతిరాజు వెంకట జగ్గరాజు మాతృమూర్తి భూపతిరాజు వెంకట నరసయమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. భూపతిరాజు జగ్గరాజు కుటుంబ సభ్యులను తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు-అన్నపూర్ణ దంపతులు ఆదివారం పరామర్శించారు. వెంకట నరసయమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.