May 10,2023 01:24
మాట్లాడుతున్న యు దేవపాలన

ప్రజాశక్తి-అద్దంకి: జన విజ్ఞాన వేదిక ఎన్‌టిఆర్‌ కళాశాలలో సమ్మర్‌ క్యాంప్‌లో మంగళవారం జానపద కళాపీఠం అధ్యక్షుడు యు దేవపాలన, కార్యదర్శి జ్యోతి చంద్రమౌళి పాల్గొన్నారు. జానపదం అంటే జనాలలో నుంచి ఉద్భవించిందని, ఇటివల ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఆస్కార్‌ అవార్డు వచ్చిన, 'నాటు నాటు' పాట జానపదం పాటని, బుర్రకథ, తోలుబొమ్మలాట, డప్పు విన్యాసాలు, కోలాటం, డోలు సన్నాయి వాయిద్యాలు మొదలగునవి జనాలను సినిమా ప్రపంచం విస్తరించకముందు, గ్రామాలలో ప్రజలను ఊర్రూతలు ఊగించేవని విద్యార్థులకు వివరించు జరిగింది, జ్యోతి చంద్రమౌళి మాట్లాడుతూ 7వ శతాబ్దంలోనే అద్దంకి చరిత్ర కోటకట్లలో బయటపడిందని చరిత్ర గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జెవివి డివిజన్‌ కార్యదర్శి తంగా శ్రీనివాసరావు, హౌమియో రఘుచంద్‌, లేవి ప్రసాదు, తంగిరాల వెంకటేశ్వర్లు, కె కోటేశ్వరకుమార్‌ పాల్గొన్నారు.