ప్రజాశక్తి -తిరువూరు
ప్రజలలో శాస్త్రీయ ఆలోచన పెంచడా నికి జనవిజ్ఞానవేదిక(జెవివి) చేస్తున్న కషి ఎంతో అభినందనీయమని ఎంపిడిఓ పి.వి.ఎస్.నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన జెవివి రూ పొందించిన డైరీ, కేలండర్లను ఆవి ష్కరించి మాట్లాడారు. ఈకార్యక్రమం లో జెవివి రాష్ట్ర చెకుముకి కన్వీనర్ ఎం.హరికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.గంగాధర్, ప్రతినిధులు ఎం.రాంప్ర దీప్, కడిమి పాపారావు, కామాల శేష గిరి, సుదర్శన్, ఇషాక్, రమేష్, వెంకట స్వామి, పి.శీనయ్య తదితరులు పాల్గొ న్నారు.










