Nov 20,2022 23:44

విజేతలకు బహుమతులిస్తున్న జెవివి ప్రతినిధులు

ప్రజాశక్తి - బుచ్చయ్యపేట : జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మాడుగుల, చీడికాడ, బుచ్చయ్యపేట మండలాలకు చెందిన విద్యార్థులకు శుక్రవారం మాడుగుల వీనస్‌ కోచింగ్‌ సెంటర్‌లో చెకుముకి పోటీలను నిర్వహించారు. .పాఠశాల స్థాయిలో పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు ధ్రువపత్రాలను, బహుమతులను జన విజ్ఞాన వేదిక సభ్యులు అందజేశారు. బుచ్చయ్య పేట మండలం నుంచి జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులు ఆడారి.మోహన ప్రియ, తమరపల్లి హేమన్య, చింతాడ గోవింద్‌,వై.గగన్‌ తేజ , జి. అమృత, సిహెచ్‌ చంద్రిక, గాడి భవానీ, గంట శ్రీదేవి, కట్టోజు మేఘన ఎంపికయ్యారు.కార్యక్రమంలో జెవివి మండల అధ్యక్షులు సురేష్‌ శాంతో, ప్రధాన కార్యదర్శి తాలపురెడ్డి నాగ చంద్ర, కార్యదర్శ గౌరిపట్టపు మహేష్‌, ఉపాధ్యక్షులు జాగాబు ఈశ్వరరావు, కోశాధికారి గొట్టాపు చిన్నం నాయుడు పాల్గొని, జిల్లాస్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందించారు.