Sep 03,2023 20:06

జెవివి నగర మహసభలో నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శిలు విజయకుమార్‌, డాక్టర్‌ శ్రీనునాయక్‌

ప్రజాశక్తి -నెల్లూరు ప్రతినిధి :జనవిజ్జాన వేదిక 17వ నెల్లూరు నగర మహసభ ఆదివారం స్థానిక జెట్టి శేషారెడ్డి భవన్‌లో ఘనంగా నిర్వహించారు. గత కార్యక్రమాలు సమీక్ష చేసుకొని, భవిష్యత్‌ కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. మతోన్మోద చర్యలకు వ్యతిరేకంగా జెపివి పోరాటం చేయాలని, ఆ సందర్భంగా సమావేశంలో తీర్మానించారు. నెల్లూరు నగరంలో విద్య, వైద్యం, పర్యావరణం, అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు, పోరాటాలు నిర్వహించాలని నిర్ణయిం చారు. జెవివిని నగరంలో బలోపేతం చేయడానికి కృషిచేస్తామని నేతలు ప్రకటించారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
జెవివి నెల్లూరు నగర నూతన కార్యవర్గం ఎన్నికైయింది. జెవివి నగర గౌర వాధ్యక్షులుగా సీనియర్‌ వైద్యులు డాక్టర్‌ ఎమ్‌డి రఫీ, అధ్యక్షులుగా ఎ. విజయ కుమార్‌, కార్యదర్శిగా డాక్టర్‌ కె. శ్రీనునాయక్‌, కోశాధికారిగా సిహెచ్‌వి కృష్ణ ఎన్నికైయ్యారు. 13 మంది కార్యవర్గం, 35 మందితో నగర కమిటీ ఎన్నికైంది.