Jul 25,2023 00:18

వినతిపత్రాన్ని చూపుతున్న మత్స్యకారులు

ప్రజాశక్తి -నక్కపల్లి:మండలంలోని రాజయ్యపేట పంచాయతీ శివారు బోయపాడు సముద్రతీరంలో జెట్టి ఏర్పాటు చేయాలని మత్స్యకారులు కోరారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో మత్స్యకారుల జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ నిర్మాణం చేపట్టాలన్నారు. సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో స్పందనలో జెట్టి, ఫిష్‌ లాండింగ్‌ సెంటర్‌ నిర్మాణంపై వినతిపత్రం అందజేసినట్లు మత్స్యకారులు స్థానిక విలేకరులకు తెలియజేశారు. బోయపాడు సముద్రతీరంలో జెట్టి ఏర్పాటు చేసేందుకు గాను పలుసార్లు అధికారులు స్థల పరిశీలన చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బాబురావు బోయపాడులో జెట్టి ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ మత్స్యకార జెఎసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాసిపిల్లి నూకరాజు, రాజయ్య పేట వైస్‌ ప్రెసిడెంట్‌ పిక్కి కొండలరావు, వార్డ్‌ మెంబర్‌ పిక్కి అప్పలరాజు, మత్స్యకార నాయకులు సిరిపిల్లి అప్పలరాజు, వాసిపిల్లి రాజు, వాసిపిల్లి యేసు, బొంది గోవిందు, పిక్కి చినతాత తదితరులు పాల్గొన్నారు .