Feb 19,2023 01:05
రిబ్బన్‌ కట్‌ చేసి జెసిబిని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కోన రఘుపతి

ప్రజాశక్తి-కర్లపాలెం: కర్లపాలెం మండలానికి చెందిన కర్లపాలెం సచివాలయ కన్వీనర్‌ ఆట్ల నాగిరెడ్డి జెసిబి కొనుగోలు చేయగా ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ మాజీ ఉపసభపతి, బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి నివాసం వద్ద శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆట్ల నాగిరెడ్డికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ దొంతుబోయిన సీతారామిరెడ్డి, అట్లా శ్రీనివాస్‌రెడ్డి, జై భారతరెడ్డి, బెనర్జీ, మార్పు రత్నం తదితరులు పాల్గొన్నారు.