Jun 19,2023 00:17

అభినందిస్తున్న ప్రిన్సిపల్‌

ప్రజాశక్తి -పాయకరావుపేట:స్థానిక శ్రీ ప్రకాష్‌ విద్యా నికేతన్‌ విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్‌ ఫలితాల్లో ప్రతిభ కనబరిచి ర్యాంకులు సాధించారని శ్రీ ప్రకాష్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ వివిఎస్‌ బి భానుమూర్తి తెలిపారు. తమ విద్యార్థి ఎన్‌ సూర్యచరణ్‌ ఎస్సీ కేటగిరీలో 199వ ర్యాంకు, జనరల్‌ కేటగిరీలో ఎస్‌.అశోక్‌ 2366వ ర్యాంకు, సాధించారని ఆయన తెలిపారు. తమ కళాశాలలో జేఈఈ అడ్వాన్స్డ్‌ ఇండస్‌ స్పెషల్‌ కోచింగ్‌తో విద్యార్థులు ర్యాంకులు సాధించారని ఆయన తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సిహెచ్‌ వికే నరసింహారావు, విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సిహెచ్‌ విజయప్రకాష్‌ అభినందించారు.