ప్రధాన రహదారిపై తెగిపడిన విద్యుత్ తీగ
ప్రజాశక్తి-చీరాల: జెసిబిని తీసుకు వెళుతున్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ తీగ ప్రధాన రహదారిపై తెగిపడిన సంఘటన బుధవారం పట్టణం లోని నెహ్రూ కూరగాయ ల మార్కెట్ వద్ద జరిగింది. స్థానికుల కథనం మేరకు పట్టణంలో నుంచి సాల్మన్ సెంటర్ వైపు జెసిబితో వెళుతున్న లారీ ఎత్తుగా ఉండటంతో విద్యుత్ తీగలకు వేగంగా తగిలింది. దీంతో ఒక్కసారిగా తీగలు తెగి కిందపడ్డాయి. అయితే పవర్ డ్రిప్ కావడంతో ఎవ్వరికీ ప్రమాదం సంభవించలేదు. లారీ డ్రైవర్ కర్రల సాయంతో తీగలు తప్పించుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.










