Nov 02,2023 21:21

మాట్లాడుతున్న విసి వెంకట సుబ్బయ్య

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  స్థానిక జెఎన్‌టియులో ఇసిఇ, ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ సెల్‌, టెక్‌ ఫ్లుఎంట్‌ సంయుక్తంగా జాతీయ స్థాయి వర్క్‌ షాప్‌ ఎన్లాగ్‌ అండ్‌ డిజిటల్‌ సి ఎంఒఎస్‌, విఎల్‌ఎస్‌ఐ డిజైనింగ్‌ యూజింగ్‌ మైక్రో విండో ఎడా టూల్‌ అనే అంశంపై మూడు రోజులు8 పాటు జాతీయస్థాయి వర్క్‌ షాప్‌ నిర్వహిస్తోంది. గురువారం ప్రారంభమైన ఈ సదస్సులో ముఖ్యఅతిథిగా జెఎన్‌టియుజివి వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె. వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. విఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ ప్రావీణ్యం కలిగిన వారిపై చాలా ఎక్కువ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఫ్యాకల్టీకి కూడా ఈ వర్క్‌షాప్‌ బాగా ఉపయోగపడుతుందని అన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జి. జయసుమ మాట్లాడుతూ రోబోటిక్‌ ఆటోమేషన్‌ గురించి అవగాహన కలిగి ఉండడం వల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని సూచించారు. ప్రత్యేక అతిథిగా మైక్రో విండ్‌ ఇండియా హెడ్‌ వినరుశర్మ రిసోర్స్‌ పర్సన్‌ గా వ్యవహరిస్తూ పైన అంశం పైన ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నారు. ఇసిఇ విభాగాధిపతి డాక్టర్‌ బి.నలిని కన్వీనర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆర్‌.గురునాథ్‌ పాల్గొన్నారు.