ప్రజాశక్తి-కాకినాడ చలమలశెట్టి సునీల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జెఎన్‌టియుకె ప్రాంగణంలో రెండు రోజుల పాటు నిర్వహించే మెగా జాబ్ మేళాను శుక్రవారం విసి ప్రొఫెసర్ జివిఆర్.ప్రసాదరాజు ప్రారంభించారు. ఐఐఐపి అండ్ టి డైరెక్టర్ ప్రొఫెసర్ జి.యేసురత్నం, యుసిఇకె ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎంహెచ్.ఎం.కష్ణప్రసాద్, యుసిఇకె ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ ఎ.కరుణల పర్యవేక్షణలో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విసి ప్రసాదరాజు మాట్లాడుతూ 70 ప్రతిష్టాత్మకమైన కంపెనీలకు సంబంధించి మూడు వేల మందికి పైబడి ఉద్యోగావకాశాల కోసం నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాను యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ జాబ్ మేళాకు సుమారుగా 13 వేల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆయన తెలిపారు. చలమలశెట్టి సునీల్ చేపడుతున్న సామాజిక, సేవా కార్యక్రమాలు అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఎల్.సుమలత, ఒఎస్‌డి డి.కోటేశ్వరరావు, డిఎపి కెవిఎ.మురళీకృష్ణ, వి.రవీంద్ర, చీఫ్ ఇంజనీర్ వి.శ్రీనివాసులు, పి.సుబ్బారావు, ఎస్‌ఎంఎస్ డైరెక్టర్ ఎ.కష్ణమోహన్, యూనివర్శిటీ స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ జి.శ్యామ్‌కుమార్, చలమలశెట్టి సునీల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ రెడ్డం దుర్గాప్రసాద్, ట్రస్ట్ ప్రతినిధులు, అధ్యాపకులు, హెస్‌ఆర్ మేనేజర్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.










