May 21,2023 22:06

జెఎన్‌టియుకె తొలి ఉపకులపతిగా బాధ్యతలు స్వీకరిస్తున్న డాక్టర్‌ అల్లం అప్పారావు (ఫైల్‌ ఫోటో)

ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌
జెఎన్‌టియుకె తొలి ఉపకులపతి ప్రొఫెసర్‌ డాక్టర్‌ అల్లం అప్పారావు(78) అమెరికాలోని డల్లాస్‌లో మృతి చెందారు. ఇటీవల అమెరికాలోని తన కుమార్తె ఇంటికి వెళ్లిన ఆయన వ్యాయామం చేసి నడచివచ్చి నిద్రపోయిన ఆయన నిద్రలోనే కన్నుమూశారు. అమెరికన్‌ కాలమానం ప్రకారం 20వ తేదీ ఉదయం 10.30 గంటలకు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అప్పారావు మృతి సమాచారం అందుకున్న జెఎన్‌టియుకె విసి ప్రసాదరాజు, రిజిస్ట్రార్‌, డైరెక్టర్లు పాలకవర్గం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అప్పారావు భౌతికకాయాన్ని అమెరికా నుండి గురువారం అప్పారావు నివాశం ఉంటున్న విశాఖపట్నానికి తీసుకువస్తారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో జెఎన్‌టియు కాకినాడ ఏర్పడిన తరువాత తొలిసారిగా ఉపకులపతి బాధ్యతలు స్వీకరించి ఎన్నెన్నో కొత్త కోర్సులు ప్రవేశపెట్టిన వర్శిటీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారు. విద్యార్థులు భవితవ్యానికి విదేశీ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేసుకుని విదేశీవిద్యను ప్రోత్సహించారు. వర్శిటీని దేశంలోనే మొదటిస్థానం పొందేందుకు విశేష కృషి చేసి యుజిసి నిధులు సాధించి ఇంజనీరింగ్‌ విద్యను సామాన్యులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. పరిశోధనలు ప్రోత్సహించారు. అప్పారావు తర్వాత వచ్చిన ఉపకులపతులు ఆయన బాటలోనే పయనించారు.
అప్పారావు కంప్యూటర్స్‌ నిపుణుడు. దక్షిణ భారతదేశంలోనే తొలి సైంటిఫిక్‌ కంప్యూటర్‌ వ్యవస్థ ఐబీఎం-1130ని ఆంధ్రా యూని వర్సిటీలో నెలకొల్పారు. స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి. తల్లిదండ్రులు లక్ష్మీబాయి. గురుమూర్తి. తండ్రి ఉపాధి కోసం విజయనగరం వచ్చి, రాజుల సంస్థానంలో దివాన్‌గా చేరారు. ఆ తరువాత సంస్థానాలన్నీ ప్రభుత్వంలో విలీనం కావడంతో ఆయనకు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం ఇచ్చారు.
తండ్రి ఉద్యోగ రీత్యా అప్పారావు విద్యాభ్యాసం ఎస్‌.కోట, ఎల్‌.్ణకోట, కొత్త వలసల్లో సాగింది. 1964లో పియుసి, 1967లో బిఎస్‌సి చేశారు. అప్పారావు తొలి ఉద్యోగం పేరే 'కంప్యూటర్‌'. గణాంక వివరాలన్నింటిని సమీకరించే పని. హిందూస్థాన్‌ పాలిమర్స్‌ 'కలర్‌ కెమిస్ట్‌' ఉద్యోగం నెల రోజులే చేశారు. దాన్ని వదిలి ఆంధ్రా యూనివర్శిటీలో పరిశోధకులకు సహాయకునిగా వుండే 'కంప్యూటర్‌ ఆపరేటర్‌'గా జాయిన్‌ అయ్యారు. బుల్లయ్య, రామచంద్రరావు మాస్టార్లు ఇద్దరూ కలిసి 1970-71 మధ్యకాలంలో దక్షిణ భారతదేశంలోనే తొలి సైంటిఫిక్‌ కంప్యూటర్‌ వ్యవస్థ ఐబీఎం-1130ను ఆంధ్రా యూనివర్శిటీలో నెలకొల్పారు. దాని నిర్వహణలో అప్పారావు ప్రముఖ పాత్ర పోషించారు. ఎంఎ (ఎకనామిక్స్‌) చేశారు. 1976-78లో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ చేశారు. పిహెచ్‌డి పూర్తిచేసి 1981లో థీసిస్‌ సమర్పిస్తే 1984 లో ఆయన పట్టా పొందారు. లో లెక్చరర్‌గా, రీడర్‌గా చేయకుండానే ఆంధ్ర యూనివర్శిటీ నేరుగా ప్రొఫెసర్‌ అయిన తొలి వ్యక్తి అప్పారావు. కంప్యూటర్స్‌ విభాగాధిపతిగా, చీఫ్‌ వార్డెన్‌, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ ఛైర్మన్‌, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌గా అనేక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన దగ్గర ఇప్పటివరకూ 15 మంది పిహెచ్‌డిలు చేసి పట్టాలు పొందారు. ఎంఎస్‌సి చేసిన వారికి ఆయన ఎంటెక్‌ చేసే అవకాశం కల్పించారు. ఎన్‌టిఆర్‌ యూనివర్శిటీతో కలిసి 'క్లినికల్‌ రీసెర్చి'పై ఆయన అధ్యయనం ప్రారంభించారు. మధుమేహ రోగం మూలాలు తెలుసుకోవడానికి అమెరికాకు చెందిన వి.ఎన్‌.దాస్‌, విశాఖలోని డాక్టర్‌ శ్రీధర్‌తో కలసి డయాబెటిస్‌ జెనిటిక్స్‌పై 'బయో ఇన్ఫర్మేటిక్స్‌' అంశంపై పదేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. ప్రొఫెసర్‌ చందు సుబ్బారావుతో కలసి 'ఐ.టి. కల్చర్‌' అనే పుస్తకం రాశారు. నవంబర్‌ 2018లో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
శ్రీభావాలు...
-ఎవరికైనా 45ఏళ్ల వయస్సులో గొప్ప అవకాశాలు వస్తే అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు.
-ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (సాంకేతిక రంగం) అంటే 'క సంస్కృతి. ఒంటరిగా మనజాలదు. అన్నింట్లోనూ ఉంటుంది. ఇది అన్ని రంగాల్లోనూ అవసరమే. ఈ రంగం ఒక్కటే ప్రత్యేకంగా పడిపోవడం అంటూ జరగదు. ఆర్థిక మాంద్యం అన్ని రంగాల్లోనూ ఉండడం వల్ల వాటితోపాటు ఇది కూడా తగ్గింది. ఇప్పుడు ఆయా రంగాలు పుంజుకుంటే ఐటీ కూడా వాటితో పాటే వృద్ధి
- మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి .