Oct 20,2023 21:55

ధ్రువపత్రాలను అందజేస్తున్న విసి వెంకట సుబ్బయ్య

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : స్థానిక జవహర్‌ లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం గురజాడ విజయనగరం అనుబంధ కళాశాలలైన డాడీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (అనకాపల్లి), విజ్ఞాన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ ఫర్‌ ఉమెన్‌ (దువ్వాడ) కళాశాలలకు యుజిసి స్వయం ప్రతిపత్తి హోదా లభించింది. ఇందుకు సంబంధించిన ధ్రువపత్రాలను జె ఎన్‌ టి యు ఉపకులపతి ప్రొఫెసర్‌ కె. వెంకటసుబ్బయ్య, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జి. జయ సుమ ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లకు అందజేశారు. జెఎన్‌టియు జివి అనుబంధ కళాశాలలైన మిరాకిల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ అండ్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్స్టిట్యూషన్స్‌ (భోగాపురం), విజ్ఞాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఫర్‌ ఉమెన్‌ (దువ్వాడ) కళాశాలలకు మూడేళ్ల శాశ్వత ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అకాడమిక్‌ అండ్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ అర్‌. రాజేశ్వరరావు ,ఆయా కళాశాలల ప్రిన్సిపాల్‌ లు పాల్గొన్నారు.