Jun 19,2023 01:01

ర్యాంకులు సాధించిన విద్యార్థులతో భాష్యం చైర్మన్‌ రామకృష్ణ

ప్రజాశక్తి-గుంటూరు : జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2023 ఫలితాలలో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ ఓపెన్‌ కేటగిరీలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులతో సంచలనం సృష్టించిందని భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌ రామకృష్ణ తెలిపారు. ఆదివారం విడుదలైన ఫలితాల్లో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థులు ఓపెన్‌ కేటగిరీలో ఎ.వి.శివరామ్‌ ఆలిండియా 5వ ర్యాంకు, వై.వి.మణీందర్‌రెడ్డి 10వ ర్యాంకు సాధించి భాష్యంకి గర్వకారణంగా నిలిచారన్నారు. అంతేకాక వివిధ కేటగిరీల్లో వై.వి.మణీందర్‌రెడ్డి ఆలిండియా 1వ ర్యాంకు, కె.లక్ష్మీసూర్య ఆలిండియా 6వ ర్యాంకు, పి.నిశ్చల్‌సుభాష్‌ ఆలిండియా 7వ ర్యాంకు, ఆర్‌.అక్షరుకార్తీక్‌ 8వ ర్యాంకు, ఎం.శ్రీవిఘ్నేష్‌ ఆలిండియా 21వ ర్యాంకు, వి.దీపేష్‌ ఆలిండియా 22వ ర్యాంకు, ఎ.మౌర్యనందన్‌ 28వ ర్యాంకు, ఐ.హర్షిత 29వ ర్యాంకు, పి.చంద్రహాస్‌ 32వ ర్యాంకు, సిహెచ్‌.కుందన్‌సాయి 39వ ర్యాంకు వంటి 50లోపు 11 అత్యుత్తమ ర్యాంకులతోపాటు ఆలిండియా 100లోపు 16 ర్యాంకులు, 200లోపు 23 ర్యాంకులు, వెయ్యిలోపు 59 ర్యాంకులు, రెండువేల లోపు 99 ర్యాంకులు, 5వేలలోపు 181 ర్యాంకులు సాధించటంతోపాటు ఐఐటి సెలక్షన్స్‌లో ఆలిండియా ఆల్‌టైం ది బెస్ట్‌గా నిలిచిందన్నారు. అన్ని పోటీ పరీక్షా ఫలితాలలో ఆల్‌రౌండర్స్‌గా నిలుస్తున్న భాష్యం ఐఐటి అకాడమీ విద్యార్థులను చూస్తే గర్వంగా ఉందని, ఈ అద్భుత ఫలితాలను పక్కా ప్రణాళికతో కూడిన మా భాష్యం ఐఐటి ఫౌండేషన్‌ కరిక్యులమే కారణమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను భాష్యం చైర్మన్‌ రామకృష్ణ, డైరెక్టర్‌ హనుమంతరావు, అధ్యాపకులు అభినందించారు. ఈ సందర్భంగా భాష్యం విద్యార్థులు నగరంలోని పలు ప్రధాన కూడళ్ల గుండా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.