జేఈఈ మెయిన్స్ లో జాతీయ స్థాయి ర్యాంకులతో మెరిసిన ఎస్డిఆర్ విద్యార్థులు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
జేఈఈ మెయిన్స్ రెండవ దశ ఫలితాలలో ఎస్ డి ఆర్ ఆకాంక్ష జూనియర్ కళాశాల విద్యార్థులు డి. యశ్వితా రెడ్డి ఆలిండియా 93వ ర్యాంకు, డి. వసంత కుమార్ ఆలిండియా 977 వ ర్యాంకు, జి. లక్ష్మీ ప్రియ ఆలిండియా 3507 వ ర్యాంకులతో పాటుగా పదిమంది విద్యార్థులు పదివేల లోపు ర్యాంకులు సాధించి నంద్యాల జిల్లాలోనే అత్యున్నత ర్యాంకులు సాధించారని కళాశాల చైర్మన్ ఎస్. కొండారెడ్డి తెలిపారు.కళాశాలలో జరిగిన విద్యార్థుల అభిందన సభ లో ముఖ్య అతిథిగా విచ్చేసిన నంద్యాల పార్లమెంటు సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి విద్యార్థులను పుష్పగుచ్ఛాలతో అభినందించి జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అధ్యాపక అధ్యాపకేతర బృందం పాల్గొన్నారు.










