Oct 26,2023 21:57

ప్రజాశక్తి - యంత్రాంగం జగనన్న ఆరోగ్య సురక్ష(జెఎఎస్‌) శిబిరాలు జిల్లాలోని పలు మండలాల్లో గురువారం జరిగాయి. గోకవరం మండలంలోని గుమ్మళ్ల దొడ్డి గ్రామంలో గ్రామ సర్పంచ్‌ శరకణం రామలక్ష్మి ఆధ్వర్యంలో జెఎఎస్‌ శిబిరంలో ఎంఎల్‌ఎ జ్యోతుల చంటిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంటిబాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు నాణ్యమైన వైద్యాన్ని జెఎఎస్‌ శిబిరాల ద్వారా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం అంగన్‌వాడీలు ఏర్పాటు చేసిన పౌష్టికాహారం స్టాల్స్‌ను పరిశీలించి, బాలింతలు, గర్భిణులకు కిట్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం, ఆర్‌బికె వెల్‌ నెస్‌ సెంటర్‌ భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ జనపరెడ్డి సుబ్బారావు, సచివాలయల కన్వీనర్‌ దాసరి రమేష్‌, వైసిపి సీనియర్‌ నాయకులు సంకర వీరబాబు, శరకనం మురళి, పి.చిన్ని, బులా అబ్బులు, హెచ్‌ఎం లక్ష్మీకాంతం, దాసరి సతీష్‌, చింతల అనిల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. చాగల్లు మండలంలోని ఉనగట్ల గ్రామంలో జెఎఎస్‌ శిబిరాన్ని తహశీల్దార్‌ కె.రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సభ్యులు, పంచాయతీ కార్యదర్శి ఎండి.అలీ, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, ఐసిడిఎస్‌ సూపర్వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశాలు, పంచాయతీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఉండ్రాజవరం మండలంలోని వేలివెన్నులో జెఎఎస్‌ శిబిరాన్ని జడ్‌పిటిసి నందిగం భాస్కర రామయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలపై అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు ఈ శిబిరాన్ని ఉపయోగించుకుని ఆరోగ్యం పొందాలని, ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, వివిధ మండల స్థాయి అధి కారులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.దేవరపల్లి మండలం రామన్నపాలెంలో జెఎఎస్‌ కార్యక్రమాన్ని ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు ప్రారంభిం చారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సంకల్పంతో సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి జెఎఎస్‌ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి కెవికె దుర్గారావు, సర్పంచ్‌ బుల్లయ్య, ఎంపిడిఒ కృష్ణంరాజు, కార్యదర్శి నిట్టా రవికిషోర్‌, వైసిపి నాయకులు వెంకటేశ్వరరావు, గాంధీ, తదితరులు పాల్గొన్నారు. కడియం స్థానిక హైస్కూల్‌ గ్రౌండ్‌లో జెఎఎస్‌ కార్యక్రమం డాక్టర్‌ మణి జ్యోత్స్న ఆధ్వర్యంలో జరిగింది. డాక్టర్‌ నాగసాయి మౌర్య, డాక్టర్‌ స్వరూప, డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ రాజేష్‌ తదితరులు రోగులను పరీక్షించి మందులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, నాయకులు వై.సతీష్‌ చంద్ర స్టాలిన్‌, శాకా పట్టాభి, సర్కార్‌ భాష, దాసరి శేషగిరి, కడియం ఇఒపిఆర్‌డి లక్ష్మీ, అడిషనల్‌ ఎంఇఒ వై.నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.