ప్రజాశక్తి- పార్వతీపురం రూరల్ : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికీ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మండలంలోని పుట్టూరు సచివాలయం పరిధిలో బుధవారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన వైద్యశిబిరంలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీస్తూ తాను కూడా బిపి, షుగర్, హిమోగ్లోబిన్ వంటి వైద్య పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహాలను తీసుకున్నారు. అనంతరం ఇక్కడ సచివాలయం పరిధిలో ఉన్న ప్రజలు అందరికీ ఉచితంగా వైద్య పరీక్షలతో పాటు మందులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బలగ రేవతమ్మ, ఎంపిపి మజ్జి శోభారాణి, స్థానిక సర్పంచ్ గుంటిరెడ్డి సతీష్ కుమార్, ఎంపిటిసి ఎగిరెడ్డి రమణమూర్తి, మండల పార్టీ అధ్యక్షులు బొమ్మి రమేష్, ఆత్మ చైర్మన్ వై తిరుపతిరావు, సీనియర్ నాయ కులు వి.దానబాబు, పలువురు నాయకులతో పాటు ఎంపిడిఒ, తహశీల్దార్, వైద్య శాఖల అధికారులు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, ప్రజలు పాల్గొన్నారు.
సీతంపేట : మండలంలోని గొయిది సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష, ఉచిత వైద్య పరీక్షలు, మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాలకొండ ఎమ్మెల్యే వి.కళావతి, ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి పాల్గొన్నారు. వైద్యశిబిరానికి వచ్చిన వారందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఎంపిపి బిడ్డిక ఆదినారాయణ, జెడ్పీటీసీ ప్రతినిధి సవర రాము, ఎంపిడిఒ కె.గీతాంజలి, వైద్యాధికారి రవీంద్ర, సిడిపిఒ రంగలక్ష్మి, స్థానిక ఎంపీటీసీ నిమ్మక హరిప్రసాద్, సర్పంచులు, కన్వీనర్లు, ఎంపిటిసిలు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని నిడగల్లులో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్యశిబిరాన్ని టిట్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు, ఎంపిడిఒ కృష్ణమహేష్ రెడ్డి, జెఎఎస్ నోడల్ అధికారి డాక్టర్ ఎం.వినోద్ తనిఖీ చేశారు. రిజిస్ట్రేన్ కౌంటర్, స్పాట్ సర్వే విభాగం, వైద్యులు తనిఖీ విభాగం, ల్యాబ్ పరీక్షలు, ఫార్మసీ కౌంటర్లను పరిశీలించారు. ఎంతమందికి టోకెన్లు అందజేశారు, నిర్వహించిన పరీక్షలు, నమోదు చేసిన రోగుల వివరాలపై సిబ్బందిని ఆరా తీశారు. ఆరోగ్యశ్రీ యాప్‌ను అందరికీ డౌన్లోడ్ చేయించి ప్రయోజనాలను వివరించాలన్నారు. మందులు వినియోగించు విధానాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. కంటి వైద్య శిబిరంలో ఎంత మందికి తనిఖీలు జరిపారు, కళ్లజోళ్లు వివరాలపై ఆరా తీశారు. అంగన్వాడీ స్టాల్స్ ను పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసిన పౌష్టికాహారం గురించి ఎంత మంది గర్భిణీలు, బాలింతలకు అవగాహన కల్పించారని అడిగారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ రాయిపల్లి. ఆరుద్ర, వైస్ ఎంపిపి తోడబండి సూర్యనారాయణ, వైద్యాధికారి డాక్టర్ రాధాకాంత్, ఎఒ ఎంఎల్‌ఎన్ ప్రసాద్, పంచాయతీ సెక్రటరీ తిరుపతి, ఎంఇఒ సూరిదేముడు, వైద్యులు, స్పెషలిస్ట్ వైద్యులు, వైద్య సిబ్బంది, సచివాలయం సిబ్బంది,అంగన్వాడీ సిబ్బంది,గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.
వీరఘట్టం : గ్రామాల్లో నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపిపి డి.వెంకటరమణనాయుడు గ్రామస్తులకు సూచించారు. మండలం హుస్సేనపురంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని పరిశీలించిన సందర్భంగా మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచి టి.లక్ష్మి, తహశీల్దార్ సిహెచ్ సత్యనారాయణ, ఎంపిడిఒ బిజె ప్రసాద్, ఎంపిటిసి ఎన్.రాముడమ్మ, డొకల సుజాత, వైద్యాధికారులు పి.ఉమామహేశ్వరి, ఎస్ నితీష, సచివాలయ కార్యదర్శి జె.షణ్ముఖరావు, వైద్య, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పౌష్టికాహారం స్టాల్ ఏర్పాటు
గరుగుబిల్లి : మండలం పరిధిలోని చినగుడబగ్రామంలో బుధవారం అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన పౌష్టికాహారం స్టాల్‌ను జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రోగ్రాం అధికారి డాక్టర్ ధవళ భాస్కరరావు సందర్శించారు. ఈ సందర్భంగా స్టాల్‌లో ప్రదర్శించిన పౌష్టికాహారానికి సంబంధించిన శెనగచక్కీలు, బెల్లంఅరిసెలు, బాలామృతంతో చేసిన లడ్డూలు, నువ్వు ఉండలు, కూరగాయలు, ఆకుకూరలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనతను నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్న పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కొమరాడ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి గొట్టాపు సుగుణ కుమారి, సూపర్వైజర్లు రౌతు లక్ష్మి, పి.అరుణకుమారి, అంగన్వాడీ వర్కర్లు చింతాడ గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు.
కురుపాం : మండలంలోని వబ్బంగి సచివాలయంలో బుధవారం జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. సచివాలయ పరిధిలో గల పిహెచ్‌సి వైద్యాధికారులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ వివి శివరామప్ప, పంచాయతీ కార్యదర్శి కె.చంద్రశేఖర్, వైద్య అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
భామిని: మండలంలోని కాట్రగాఢ -బి లో బత్తిలి వైద్యాధికారులు కొండపల్లి రవీంద్ర, డా.దామోదర్, డా. సోయల్ ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో 365 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేసిన,16 మందికి రెఫెర్ చేశారు. కార్యక్రమంలో ఎంపిపి ప్రతినిధి తోట సింహాచలం, ఎంపిడిఒ చంద్రరావు, డిప్యూటీ తహసీల్దార్ శేఖరం, ఎంఇఒ భాస్కరరావు, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసరావు, కలిశెట్టి సంతోష్ పాల్గొన్నారు.










