ప్రజాశక్తి - పార్వతీపురంరూరల్ : జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలందుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. మండలంలోని ఎమ్మార్‌నగరంలో పెదబొండపల్లి పిహెచ్‌సి వైద్యాధికారుల ఆధ్యర్వంలో శనివారం నిర్వహించిన జెఎఎస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్ని శిబిరం అంతటా తిరిగి నిర్వహణా కార్యక్రమాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి శిబిరంలో అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ వంగపండు లక్ష్మి, ఎంపిటిసి బడే రామారావు, ఎంపిపి మజ్జి శోభారాణి, నాయకులు బొమ్మి రమేష్, బంకురు రవికుమార్, మజ్జి చంధ్రశేఖర్, భీమవరపు కృష్ణమూర్తి, బలగ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని పెదభోగిలి సచివాలయంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎ.జోగారావు పాల్గొన్నారు. ఈ వైద్యశిబిరంలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి వైద్యులను సంప్రదించి ఆయా గ్రామాల్లో ప్రధానంగా ప్రజలు ఏఏ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైసిపి మండల పార్టీ అధ్యక్షులు, ఎంపిపిలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్లు, ఎంపిటిసి సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మండలాల అధికారులు, వైద్యులు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, స్థానిక ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సాలూరు: పట్టణంలోని డబ్బివీధి మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి స్పందన లభించింది. మున్సిపల్ చైర్ పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్ కన్వీనర్ గిరిరఘు, డిసిఎంఎస్ డైరెక్టర్ పిరిడి రామకష్ణ హాజరైన కార్యక్రమంలో వైద్య సేవలు పొందడానికి రోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.జయరాం, మేనేజర్ రాఘవా చార్యులు, 20వార్డు ఇంఛార్జి పి.వాసుదేవరావు పాల్గొన్నారు.
కురుపాం : మండలంలోని బియ్యాలవలస సచివాలయం వద్ద జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపిపి శెట్టి పద్మావతి ప్రారంభించారు. ఈ శిబిరానికి బియ్యాలవలస, గుమ్మడిగూడ పంచాయతీ పరిధిలో గల 12 గిరిజన గ్రామాల నుంచి 674 మంది హాజరయ్యారు. వైద్యాధికారులు కె.సుమిని సుప్రియ, కె.కిరణ్, ఎ.లోకబహిన్, ఎ.సాయిప్రసాద్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారని అన్నారు. అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్భిణులకు నిర్వహించిన సామూహిక సీమంతం కార్యక్రమంలో పాల్గొనే పౌష్టికాహారం అందజేశారు. కార్యక్రమంలో బియ్యాలవలస సర్పంచ్ పువ్వుల అజారి, గుమ్మడిగూడ సర్పంచ్ శెట్టి సురేష్, జిల్లా అధికార ప్రతినిధి శెట్టి నాగేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి కె.అనురాధ, సచివాలయ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : ప్రతి పేదవాడికి మెరుగైన వైద్య సేవలు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా అందుతున్నాయని స్థానిక సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకరరావు అన్నారు. గుమ్మలక్ష్మీపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిపి కె.దీనమయ్య, వైస్ ఎంపిపి నిమ్మక శేఖర్, ఎంపిడిఒ సాల్మన్‌రాజు, తహశీల్దార్ జె.రాములమ్మ, డిప్యూటీ తహశీల్దార్ రాజేంద్ర, ఐసిడిఎస్ పిఒ సుశీలాదేవి, పంచాయతీ కార్యదర్శి కిషోర్, వైద్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సాలూరు రూరల్ : జగనన్న ఆరోగ్య సురక్ష ప్రతి పేద కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ లక్ష్యమని వైస్ ఎంపిపి రెడ్డి సురేష్ అన్నారు. మండలంలోని కొదమ పంచాయతీ మోనంగిలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా కార్యదర్శి దండి శ్రీనివాసరావు, సర్పంచులు నూకయ్య, సుధాకర్, వైద్య, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.










