ప్రజాశక్తి-గుమ్మలక్ష్మీపురం : మారుమూల గిరిజన గ్రామాల్లో జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి టి.జగన్మోహనరావు వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని మండ గ్రామంలో జెఎఎస్ శిబిరాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. వైద్య శిబిరంలో 500 మందికి పరీక్షలు చేశారు. ఈ శిబిరాన్ని సర్పంచి ఎం.హైమావతి ప్రారంభించారు. రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను అడిగి, ఏ మేరకు వైద్య సేవలు అందుతున్నాయో తెలుసుకున్నారు. మందులు, ఆరోగ్య తనిఖీ నివేదికలను పరిశీలించారు. అనంతరం ప్రతీ కౌంటర్ వద్ద ప్రజలకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ఎంత మంది నమోదు అయ్యారని రిజిస్ట్రేషన్ కౌంటర్‌లో అడిగి తెలుసుకొన్నారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్న వారిని ఆరోగ్య మిత్ర ద్వారా తగు దిశా నిర్దేశం చేయాలన్నారు. ల్యాబ్‌లో పరీక్షలను తనిఖీ చేసి నివేదికలను పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శించి, అక్కడ పౌష్టికాహారం పరిశీలించారు. కార్యక్రమంలో తహశీల్దార్ రాములమ్మ, ఇఒపిఆర్‌డి జగదీష్ కుమార్, వైద్యులు ఎం.బుద్దేశ్వరరావు, పి.అభిలాష్, జి.ప్రభాకర్‌రావు, సర్పంచ్ ఎన్.హైమావతి, పాఠశాల హెచ్‌ఎం పాలక దేవానంద్, పంచాయతీ కార్యదర్శి ఎం.షర్మిల, సిడిపిఒ సిహెచ్ సుశీలదేవి, తదితరులు పాల్గొన్నారు.
సాలూరురూరల్ : ప్రజా శ్రేయస్సు కోసమే నిరంతరము ప్రభుత్వం పనిచేస్తుందని వైసిపి మండల అధ్యక్షుడు సువ్వాడ భరత్ శ్రీనివాస రావు తెలిపారు. సోమవారం కరాసువలసలో జరిగిన జగనన్న సరక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పిల్లలకు బాలింతలకు పౌష్టికాహారం అందించే విధానాన్ని అంగన్వాడీలకు వివరించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ గొల్లపల్లి పార్వతి, సర్పంచ్ ఒంటి లక్ష్మీ, ఒంటి పరమేష్, వైసిపి నాయకులు సువ్వడ రామకృష్ణ, పెద్దింటి మాధవ రావు, నాయుడు, సీతా రాం పాల్గొన్నారు
సీతంపేట : మండలంలోని మర్రిపాడు పిహెచ్‌సిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వైద్యాధికారి డాక్టర్ సాయిచరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు 422 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య నిపుణులు, సిబ్బంది పాల్గొన్నారు.
వీరఘట్టం : గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని సర్పంచ్ పి.కామేశ్వరరావు అన్నారు. గోర గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపిటిసి సవర ప్రశాంతి, ఎంపిడిఒ వై వెంకటరమణ, వైద్యాధికారులు పాల్గొన్నారు.










