Oct 21,2023 21:08

మెడికల్‌ కిట్లు అందజేస్తున్న ఎమ్మెల్యే శ్రీనివాసరావు

ప్రజాశక్తి-శృంగవరపుకోట :  జగనన్న ఆరోగ్య సురక్షతో ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. పట్టణంలోని సచివాలయం-4 పరిధిలో శనివారం ఏర్పాటుచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. వైద్యశిబిరంలో సేవలు పొందుతున్న ప్రజలతో ఎమ్మెల్సీ మమేకమై, అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఐసిడిఎస్‌ పౌష్టికాహార శాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జగనన్న ఆరోగ్య కిట్లను ఆయన అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపిపి ఇందుకూరి సుధారాజు, సర్పంచ్‌ జి.సంతోషికుమారి, ఎంపిటిసిలు మజ్జి దేవి, బొడ్డేటి ఆదిలక్ష్మి, నాయకులు గంగరాజు, వాకాడ రమణ, వెంకటరమణ, ఎంపిడిఒ శేషుబాబు, ఇఒ లక్ష్మి పాల్గొన్నారు.
కొత్తవలస : జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు కోరారు. బలిఘట్టంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఆయన సందర్శించారు. కార్యక్రమంలో కొప్పల వెలమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నెక్కల నాయుడు బాబు, వైసిపి మండల అధ్యక్షులు ఒబ్బిన నాయుడు, సర్పంచ్‌ మచ్చ ఎర్రయ్య రామస్వామి, వైస్‌ సర్పంచ్‌ పెనగంటి చెల్లయ్య, బోదల సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.
బొండపల్లి : వెదురువాడ సచివాలయంలో తహశీల్దార్‌ ప్రసాద్‌రావు ఆధ్వర్యం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ శిబిరాన్ని ఎంపిపి చల్ల చలం నాయుడు సందర్శించారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి రాపాక సూర్యప్రకాశరావు, ఇఒపిఆర్‌డి సుగుణాకర్‌రావు, ఎంపిటిసి మోపాడ సరస్వతి, రాము, నారాయణ మూర్తి రాజు పాల్గొన్నారు.
విజయనగరం టౌన్‌ : ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని ఫ్లోర్‌ లీడర్‌ ఎస్‌ వి వి రాజేష్‌ అన్నారు. శనివారం 17వ డివిజన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కమిషనర్‌ ఆర్‌ శ్రీ రాముల నాయుడు, సహాయ కమిషనర్‌ ప్రసాదరావు తో కలిసి జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలను ఆరా తీశారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్‌ కొండపల్లి సాంబమూర్తి పాల్గొన్నారు.

వేపాడ : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో అందరికీ వైద్య సేవలు అందినట్లు మండల ప్రత్యేకాధికారి లకీëనారాయణ తెలిపారు. ఇటీవల గ్రామాల్లో నిర్వహించిన జగనన్న సురక్ష ఆరోగ్య సేవలపై మండల స్థాయి అధికారులతో శనివారం మండల ప్రత్యేకాధికారి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైద్యాధికారులు, సిబ్బంది, ఐసిడిఎస్‌ అధికారులకు, సచివాలయ సిబ్బందికి అభినందనలు తెలిపారు. జగనన్నకు చెబుదాం యాప్‌ ద్వారా వచ్చిన వినతిపత్రాలను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు. అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలు కూడా పూర్తి అయ్యే విధంగా కృషి చేయాలని కోరారు.