ప్రజాశక్తి - సాలూరు : జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్) కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ కోరారు. మండలంలోని కందులపదంలో జగనన్న ఆరోగ్య సురక్ష(జెఎఎస్) కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. జెఎఎస్ కౌంటర్లను, వైద్యులు, సిబ్బంది హాజరు, చికిత్స కోసం వచ్చిన ప్రజలు, వైద్య సేవలను కలెక్టర్ పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది ప్రజలకు ఉత్తమ సేవలందించాలని సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్) కార్యక్రమం నిరుపేదలు, దూర ప్రాంతాల ప్రజలకు ఒక గొప్ప వరమని, నిపుణులైన వైద్యులు తమ వద్దకు వచ్చి వైద్య సేవలందించడం జరుగుతుందని వివరించారు. కావున ఈ వైద్యసేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో తహశీల్దార్ బి.బాలమురళీకృష్ణ, ఎంపిడిఒ జి.పార్వతి, డెప్యూటీ డిఎంహెచ్‌ఒ శివకుమార్, డాక్టర్ ఎం.మహేష్, కె.శ్రీకాంత్, సర్పంచ్ టి.జోగమ్మ, ఎంపిటిసి సభ్యులు జె.సీతారామ్, సాలూరు మెడికల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
వీరఘట్టం : మండలంలోని నర్సిపురంలో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షులు కర్రి గోవిందరావు మాట్లాడారు. ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించుకుని ఆరోగ్య వంతులుగా ఉండాలన్నారు. అనంతరం వివిధ రకాలైన రోగులకు తనిఖీలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచు కర్రి సత్యవతి, ఎంపిటిసి సభ్యులు కె.ప్రశాంతి, ఎంపిడిఒ జిజె ప్రసాద్, వైద్యాధికారులు పి.ఉమామహేశ్వరి, ఎ.మానస, వెంకటరమణ, సచివాలయ కార్యదర్శి జి.రూప, వైద్య, సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పార్వతీపురంరూరల్ : జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపిడిఒ అకిబ్‌జావేద్ అన్నారు, మండలంలోని బాలగొడబలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ముందుగా శిబిరాన్ని సందర్శించి రోగులతో మాట్లాడి వైద్యం అందుతున్న తీరును గమనించారు. వైద్యులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పోలమ్మ, పండు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.గురురాజు, తహశీల్దార్ శివన్నారాయణ, ప్రభుత్వ వైద్యాధికారులు, వైద్యులు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, స్థానికులు పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని లక్ష్మీపురం గ్రామ సచివాలయం పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, ఎంపిడిఒ బి.కృష్ణమహేశ్‌రెడ్డి పరిశీలించారు. అలాగే 465 మందికి తనిఖీలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి ఎం.బాబ్జీ, ఎంపిపి బి.రమణమ్మ, వైద్యాధికారులు ఎం.రాధాకాంత్, ఎం.ఉషారాణి, వైద్యులు, సర్పంచ్ తుమ్మపల్లి సత్యవతి ఎంపీటీసీ టి.పార్వతి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
పొలంగూడను సందర్శించిన డిఎంహెచ్‌ఒ
కురుపాం : జిల్లా వైద్య అధికారి బి.జగన్నాధరావు నీలకంఠాపురం పిహెచ్‌సి పరిధిలోగల పొలంగూడ గిరిజన గ్రామాన్ని మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పచ్చకామర్లతో బాధపడి పసరమందు తాగి వికటించి ఇద్దరు చిన్నారులు మతిచెందిన సంఘటన తెలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారులతో కలిసి గ్రామానికి వెళ్లారు. మృతికి గల కారణాలు తెలుసుకొని ఆ గ్రామస్తులకు మూఢనమ్మకాలు, పసరు మందులు వాడొద్దని ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే సంబంధిత పిహెచ్‌సికి వెళ్లాలని సూచించారు. అనంతరం జి.శివడసచివాలయంలో జరుగుతున్న జగన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమ శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు జగనన్న ఆరోగ్య సురక్షను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వెద్యాధికారులు బి.ప్రజ్ఞ, పి.అభినవ్ కుమార్, కె.వెంకట హర్ష, సరళ దేవి (జనరల్ మెడిసిన్), పి.పర్ధన్ బ్యన్ (శ్వాసకోస) వైద్య నిపుణులు పాల్గొన్నారు.










