ప్రజాశక్తి-డెంకాడ : జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలకు విశేష స్పందన లభిస్తోంది. మండలంలోని చొల్లంగిపేటలో 600 మందికి సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సచివాలయ పరిధిలో చొల్లంగిపేటతోపాటు మరో 8 మధుర గ్రామాలకు చెందిన ప్రజలు అత్యధికంగా పాల్గొని వైద్య పరీక్షలు చేసుకున్నారు. అవసరమైన వారికి మందులు అందజేశారు. 200 మందికి కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలు అవసరమైన వారిని గుర్తించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ పి. ఆదిలక్ష్మి, చొల్లంగి పేట సర్పంచ్ కోరాడ కనకరాజు, ఢకొీల్లాం సర్పంచ్ అట్టాడ శివకృష్ణ, ఎంపిటిసి కిరణ్, నాయకులు చిట్టి రాజు, అప్పారావు, చిన్న, మోపాడ, డెంకాడ పిహెచ్‌సి వైద్యాధికారులు, వైద్య, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భోగాపురం: మండల కేంద్రంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. దీనిపై పోలిపల్లి వైద్యాధికారి తిరుపతి స్వామి మాట్లాడుతూ 354 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారని అన్నారు. ఎంపిడిఒ ఎన్. అప్పలనాయుడు, తహశీల్దారు చింతాడ బంగార్రాజు, ఇఒపిఆర్‌డి సురేష్, పంచాయతీ కార్యదర్శి సురేష్ శిబిరాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ కొమ్మూరి సుభోషణరావు, సచివాలయ కన్వినర్ సుందర హరీష్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
బొండపల్లి : మండలంలోని గొట్లాం గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వైస్ ఎంపిపి మీసాల సరోజినీ ప్రారంభించారు. కార్యక్రమంలో పిఎసిఎస్ అధ్యక్షులు మహంతి రమణ, ఎంపిడిఒ వైవి రాజేంద్ర ప్రసాద్, సిఎస్ డిటి రవిశేఖర్, హౌసింగ్ ఎఇ బివి.రామరాజు, ఎంఇఒ అల్లు వెంకటరమణ పాల్గొన్నారు.
వేపాడ : మండలంలోని బానాది గ్రామంలో జగనన్న సురక్ష ఆరోగ్య శిబిరాన్ని సర్పంచ్ కర్రి యశోద ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. వైద్యులు ఎ.ధరణి, సిహెచ్‌ఒ ఆంజనేయులు వైద్య సేవలందించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ బిఎస్‌కెఎన్ పట్నాయక్, పంచాయతీ కార్యదర్శి ప్రభుదాస్ పాల్గొన్నారు.
తెర్లాం : మండలంలోని ఎంఆర్ అగ్రహారం సచివాలయ పరిధిలోని జగనన్న సురక్ష కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. వైద్య సేవ నిమిత్తం 300 మందికి పైగా హాజరయ్యారు. వైద్యులు కిరణ్, శ్రీనివాసరావు, మాధవి పరీక్షలు చేసి, మందులు అందించారు. కార్యక్రమంలో ఎంపిడిఒ ఎస్.రామకృష్ణ, డిప్యూటీ తహశీల్దార్ భాస్కరరావు, సర్పంచ్ రాంబాబు, రామకృష్ణ వాలంటీర్లు పాల్గొన్నారు.










