Oct 20,2023 22:05

జియ్యమ్మవలస : వైద్యశిబిరాన్ని పరిశీలిస్తున్న డిఎంహెచ్‌ఒ జగన్నాధరావు

జియ్యమ్మవలస: జగనన్న ఆరోగ్య సురక్ష (జెఎఎస్‌) ఒక సువర్ణ అధ్యాయమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ బగాది జగన్నాథరావు అన్నారు. జెఎఎస్‌ వైద్య శిబిరాన్ని మండలంలోని శిఖబడిలో శుక్రవారం ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి తనిఖీ చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో దీన్ని ఉపయోగించుకుం టున్నారని ఆయన చెప్పారు. వైద్య నిపుణులు గ్రామాల్లోకి వచ్చి సేవలు అందిస్తారని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
కురుపాం : మండలంలో పి.లేవిడి సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష మొండెంఖల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి బి.ప్రజ్ఞ ఆధ్వర్యాన జరిగాయి. 521 రోగులకు వైద్య సేవలందించి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు పి.అభినవ్‌కుమార్‌, లలితా, సత్య, సచివాలయ, వైద్య సిబ్బంది,104 సిబ్బంది పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని కాశీపేటలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎ. జోగారావు మాట్లాడుతూ అన్ని రకాల వ్యాధులకు ఈ శిబిరాల ద్వారా రోగులకు తనిఖీలు నిర్వహించి మందులు ఇవ్వడమే కాకుండా వారికి ఆపరేషన్లు చేయాల్సి వస్తే ప్రభుత్వమే ఉచితంగా చికిత్స చేస్తుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ఎంవి రమణ, సర్పంచ్‌ టి.జానకమ్మ, మాజీ జడ్పిటిసి వెంకట అప్పలనాయుడు, వైసిపి నాయకులు శ్రీనివాసరావు ప్రజలు పాల్గొన్నారు.
వీరఘట్టం: మండలంలోని దశమంతపురంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సర్పంచ్‌ వావిలపల్లి ఉషారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా 425 మందికి తనిఖీలు నిర్వహించినట్లు వైద్య అధికారులు పి ఉమామహేశ్వరి, ఎస్‌.నితీష, వైవి.రమణలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిడిఒ వై.వెంకటరమణ, వైద్య, ఐసిడిఎస్‌ సూపర్వైజర్లు జనార్దన్‌రావు, ఓ శాంతకుమారి, జ్ఞానమ్మ, విద్యానంద్‌, సచివాలయ సెక్రెటరీ సునీల్‌ కుమార్‌, విఆర్‌ఒ జి.రాజేంద్రప్రసాద్‌, సచివాలయ సిబ్బంది, ఆశ వర్కర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గరుగుబిల్లి: మండలంలోని పెద్దూరులో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎంపిపి రామారావు, జడ్పీ వైస్‌ చైర్మన్‌ బాపూజీనాయుడు, జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి టి.జగన్మోహనరావు పరిశీలించారు. శిబిరానికి వచ్చిన వారితో మాట్లాడి వైద్యం అందుతున్న విధానంపై ఆరా తీశారు. వైద్య సహాయం పొందుతున్న వారికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య (ఐడి)ను జారీ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం అంగన్వాడీస్టాల్‌ను పరిశీలించి ఎంతమంది గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పై అవగాహన కల్పించారని అడిగారు. కార్యక్రమంలోఎంపిడిఒ జి.పైడితల్లి, ఇఒపిఆర్‌డి గోపాలరావు, వైసిపి నాయకులు అంబటి గౌరునాయుడు, అశోక్‌ బ్రహ్మ, బంకురు అప్పలనాయుడు, పిహెచ్సి వైద్యాధికారులు పి. ప్రియాంక, కె. అరుణ కుమారి, వైస్‌ సర్పంచ్‌ తెర్లి యల్లం నాయుడు,స్పెషలిస్ట్‌ వైద్యులు, వైద్య సిబ్బంది, సచివాలయం సిబ్బంది,అంగన్వాడీ సిబ్బంది,104 సిబ్బంది, గ్రామ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : మండలంలోని లుంబేసు లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచి తోయక చిలకమ్మా ప్రారంభించారు. పంచాయతీ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి గిరిజనులు వచ్చి వైద్య సేవలు అందుకున్నారు.కార్యక్రమంలో ఎంపిటిసి మండంగి గౌరమ్మ, ఈవోపీఆర్డి జగదీష్‌ కుమార్‌, తాసిల్దార్‌ రాములమ్మ, పంచాయతీ కార్యదర్శి రాజేష్‌, ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ శ్రీదేవి, వైద్య, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.