ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
స్థానిక జేబి గ్రాండ్ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం 7గంటల సమయంలో హోటల్‌లో మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేసారు. ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక ఎస్‌ఐ సాగర్ బాబు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.










