Feb 25,2023 23:48

మాట్లాడుతున్న వైసిపి నాయకులు

ప్రజాశక్తి బుచ్చయ్యపేట
జగనన్న కాలనీల్లో అక్రమాలు జరిగాయని, అనార్హులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశారని స్థానిక జెడ్పిటిసి దొండా రాంబాబు జిల్లా పరిషత్‌ సమావేశంలో మాట్లాడటం సరికాదని మండలంలోని పలువురు వైసిపి నాయకులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అన్నారు. మండలంలోని మల్లం సర్పంచ్‌ బర్ల శివకు పరామర్శించడానికి వచ్చిన వారు విలేకర్లతో మాట్లాడారు. మండలంలో ఎటువంటి అక్రమాలు, అవినీతి జరగలేదన్నారు. స్థానిక శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ సారథ్యంలో మండలం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పారు. అధికార పార్టీ జెడ్‌పిటిసి ఉన్న రాంబాబు వైసిపి నియమ, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని విమర్శించారు. రాంబాబు ఇలాంటి ఆరోపణలు మానుకోవాలని హితవుపలికారు. ఈ సమావేశంలో వైసిపి మండల అధ్యక్షులు కొల్లిమల్ల అచ్చింనాయుడు, విశాఖ డెయిరీ డైరెక్టర్‌ గేదెల సత్యనారాయణ, ఎంపీపీ దాకారపు నాగేశ్వరిదేవి నాగరాజు, వైస్‌ ఎంపీపీ గొంపా చినబాబు, ఎంపీటీసీల ఫోరమ్‌ మండల అధ్యక్షులు దేవర అప్పారావు, సర్పంచ్‌ల ఫోరమ్‌ మండల అధ్యక్షులు మరిసా నాని, వైసిపి మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నమ్మి అప్పలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి జోగా కొండబాబు, పలువురు సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.