నివాళులర్పిస్తున్న చైర్‌పర్సన్ అరుణమ్మ
నివాళులర్పిస్తున్న చైర్‌పర్సన్ అరుణమ్మ
జెడ్‌పిలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి
ప్రజాశక్తి-నెల్లూరు :ఆంధ్రకేసరి స్ఫూర్తితో ప్రతి ఒక్కరు అభివద్ధి వైపు ఆత్మస్థైర్యంతో అడుగులు ముందుకు వేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 152వ జయంతి సందర్భంగా బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అరుణమ్మ పుష్పమాలలతో ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్య్రం కొరకు ఆంధ్రకేసరి చేసిన పోరాటాలు ఎనలేనివన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ఉద్యోగులంతా చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.తదుపరి డిపిఓ సుస్మిత, కార్యాలయ సిబ్బంది పలువురు పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.










