Oct 28,2023 22:24

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: జిల్లా పరిషత్‌ కార్యాలయ పరిధిలోని అన్ని శాఖలను జెడ్పి ఛైర్మెన్‌ శ్రీనివాసులు, సిఈఒ ప్రభాకర్‌రెడ్డి శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌ ద్వారా చేపడుతున్న కారుణ్య నియామకం ఫైల్స్‌ను త్వరితగతిన తయారు చేయాలన్నారు. అలాగే ప్లానింగ్‌ సెక్షన్‌లో పనుల మంజూరు, వర్క్‌ బిల్లుల స్క్రూట్నీ, బిల్లుల చెల్లింపులు, కోర్ట్‌ ఫైల్స్‌ సకాలంలో తయారు, జడ్పీ పిఎఫ్‌ సెక్షన్స్‌లో ఉద్యోగుల, టీచర్స్‌ చందా వివరాలను మాన్యూవల్‌గా తయారుచేసి లోన్స్‌ త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. ఇంజనీరింగ్‌ ఆఫీసు పైభాగంలో చెట్లు మొలవడాన్ని గమనించి చెట్లును వెంటనే తీసివేయాలని సూచించారు. అలాగే ఇంజనీరింగ్‌ డివిజన్‌ ఆఫీసులలో వర్క్‌ బిల్లులు పెండింగ్‌ లేకుండా చూడాలని, ఆన్లైన్‌లో బిల్లులు చెల్లింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, సిబ్బంది అందరూ సకాలంలో విధులకు హాజరై, విధులను సక్రమంగా నిర్వర్తించాలని సిబ్బందికి సూచించారు. అనతరం తన ఛాంబ్‌లో ఇంజనీరింగ్‌ ఎస్సీ, డీఈ, ఏఈలతో సమావేశం నిర్వహించి నిర్మాణంలో ఉన్న అన్ని రకాల పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. బిల్లుల చెల్లింపుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఛైర్మెన్‌, సీఈఓతో పాటు వైస్‌ ఛైర్మెన్‌ రమ్య, స్టాడింగ్‌ కమిటీ ఛైర్మెన్‌ భారతి వివిధ జెడ్పి శాఖల అధికారులు పాల్గొన్నారు.