Oct 15,2023 22:09

ప్రజాశక్తి - సామర్లకోట సామర్లకోట జిల్లా పరిషత్‌ బాలిక ఉన్నత పాఠశాలలో ఆదివారం పలు క్లాస్‌ రూమ్స్‌లోకి పాములు గోడ మీద నుంచి కిటికీల నుంచి పాకుతూ హల్‌చల్‌ చేశాయి. నాడు-నేడు పనుల్లో భాగంగా ఫేజ్‌-2 కింద సుమారు 12 తరగతుల నిర్మాణానికి పలువురు సిబ్బంది పనులు నిర్వహిస్తుండగా స్లాబు వేసేందుకు ఉపయోగించే పలు ఇనుప ఊసల కింద పెద్ద ఎత్తున పాములు దర్శనమిచ్చాయి. పనులు నిర్వహించే సిబ్బంది ఇనుప ఊసలను ఒక్కసారిగా తీయగా పాములు చెల్లాచెదురై పాఠశాల తరగతి గదుల్లోకి చెల్లాచెదురుగా వెళ్ళాయి. దీంతో పనులు నిర్వహించే పలువురు భయాందోళకు గురయ్యారు. ఇంత పెద్ద ఎత్తున పాఠశాల ఆవరణలో పాములు ఉండాడానికి కారణం పాఠశాలను ఆనుకుని గుబురుగా తుప్పలు ఉన్నాయని అంటు న్నారు. పాఠశాలకు దసరా సెలవుల కారణంగా విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని, పాఠశాల ఆవరణలో చెత్త చదరాలను తొలగించాలని కోరుతున్నారు.