
జెడ్‌పి నిధులతో బోరు ఏర్పాటు
ప్రజాశక్తి-ఉదయగిరి : యాదవ వీధి తాగునీటి అవసరాల కోసం జిల్లా పరిషత్ నిధులతో నూతన బోరు ఏర్పాటు చేశారు. గురువారం స్థానిక యాదవ్ వీధిలో సర్పంచ్ పావులూరు సామ్రాజ్యం భూమిపూజ చేసి నూతన బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీటి కోసం వీధి ప్రజలు ఎంతో ఇబ్బంది పడే క్రమంలో జెడ్‌పిటిసి మోడీ రామాంజనేయులు చొరవ చూపి బోరు మంజూరు చేయించారన్నారు. ఈ బోరు వల్ల యాదవపాలెం వీధికి నీటి ఇబ్బందులు తీరినట్లేనని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బిట్ టు ఎంపిటిసి పెద్ద మస్తానీ ఎస్దాని, 13వ వార్డు మెంబర్ ఉప్పుటూరు శ్రీనివాసులు, వక్ఫ్ బోర్డు మెంబర్ గడియాల్చి ఎస్దాని, ఎంఏ రియాజ్, కన్నెమరకల పెంచలయ్య, షేక్ లాడెన్, షేక్ సుభాని, కంచుపాటి సురేష్, అశోక్ పాల్గొన్నారు.