ప్రజాశక్తి-చింతూరు
చింతూరు మండల కేంద్రంలోని 1974 సంవత్సరంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్వర్ణోత్సవాలకు ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన సన్నాహాలు చేస్తున్నారు. గత 48 సంవత్సరాల్లో ఈ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఒక చోట కలుసుకొనే అపూర్వ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కమిటీల వారీగా పనులు ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో నాలుగు లక్షల రూపాయలతో విద్యార్థుల చిహ్నంగా ఒక పైలాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఐటిడిఎ పిఒ ఫర్మన్ అహ్మద్ ఖాన్, ఎటిడబ్ల్యూఒ కె.సుజాత, ఎంపీడీవో రవిబాబు, డీఎఫ్‌ఓ సాయిబాబా, స్థానిక సిఐ ఎం.అప్పలనాయుడు, ఎఎంవిఐ మోటార్ వెహికల్ అధికారి ఎస్.జగదీష్‌ను సోమవారం పూర్వ విద్యార్థుల ఆహ్వాన కమిటీ కలిసి ఆహ్వాన పత్రికలను అందజేసింది. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు అంకు ప్రసాద్, పరకాల ఎస్పీ జూపల్లి శివరామయ్య, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎండి జిక్రియ, ఎస్‌ఎ ఆసిఫ్ గని, ఏఎల్‌ఎన్ మూర్తి, ఐవీ నరసింహారావు, ఎస్కే షాజహాన్, బేడే సతీష్, ఎం.సతీష్. జీవన్, ఇల్లా మురళి, ఐ.సురేష్ తదితరులు పాల్గొన్నారు.










