Feb 02,2023 00:04

జెడ్‌పి ఛైర్మన్‌ క్యాంపు కార్యాలయం ప్రారంభం


ప్రజాశక్తి-పాడేరుటౌన్‌:జడ్‌పి చైర్మన్‌ క్యాంపు కార్యాలయం బుధవారం అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులోని జడ్‌పి అతిథి గృహంలో జడ్‌పి చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, జిసిసి చైర్‌పర్సన్‌ శోభ స్వాతిరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యాలయ నిర్మాణానికి 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి రూ.10 లక్షల ఖర్చుతో పనులు చేపట్టినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపి మెడికల్‌ కౌన్సిల్‌ నెంబర్‌ టి.నర్సింగరావు, జెడ్‌పి సిఇఒ శ్రీరామమూర్తి, ఎంపిపి సొనారి రత్నకుమారి, వైస్‌ ఎంపిపి కనకాలమ్మ, హుకుంపేట జెడ్పిటిసి రేగం మత్స్యలింగం, ఎఎంసి చైర్మన్‌ సూరిబాబు, ఎఎంసి డైరెక్టర్‌ గబ్బాడ రాజారావు, సర్పంచులు పార్వతమ్మ, సీతమ్మ, నీలకంఠం, రాంబాబు, బసవన్నదొర, బొంజుబాబు, ఎంపిటిసిలు రామకష్ణ పాత్రుడు, చిట్టెమ్మ, వైసిపి నాయకులు సీదరి రాంబాబు, జల్లిపల్లి మూర్తి, అరబీరు జగబంధు, మినుముల కన్నాపాత్రుడు, సత్యనారాయణ, దశమూర్తి, రామారావు, బాబురావు, సత్యవతి, ఊర్వశీరాణి తదితరులు పాల్గొన్నారు.