
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు ఉమ్మడి జిల్లా పరిషత్ సవరణ బడ్జెట్ 2023-24, అంచనా బడ్జెట్ 2024-25కు సంబంధించిన ప్రతిపాదనలపై అధికార్లతో జెడ్‌పి చైర్‌పర్సన్ హెని క్రిస్టీనా శుక్రవారం చర్చించారు. పంచాయతీరాజ్, ఆర్‌డ బ్ల్యూఎస్ అధికారులు వెంటనే ప్రతిపాదనలు ఇవ్వాలని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేయాల్సి ఉందని చెప్పారు. బడ్జెట్ అంచనాలను వెంటనే జిల్లా పరిషత్‌కు పంపితే వాటిని స్టాండింగ్ కమిటీ, సర్వసభ్య సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపి త్వరలో ప్రభుత్వానికి పంపాల్సి ఉందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల ప్రగతిని సమీక్షించారు. జిల్లా పరిషత్ గణాంకాధికారి జి.శ్రీనివాసరావు, పరిపాలన అధికారులు ఎల్.ఎస్.టి.నాగరాజు, ప్లానింగ్ సెక్షన్ సూపరింటెండెంట్ రాజారత్నబాబు పాల్గొన్నారు.