బజిల్లాలో రెవెన్యూ వ్యవస్థ పనితీరు అధ్వానంగా ఉందని, సంస్కరించని పక్షంలో వాకౌట్ చేసి వెళ్లిపోతామని హెచ్చరికల మధ్య జిల్లా పరిషత్ సమావేశం నడిచింది. జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. భూములను ఆన్‌లైన్ చేయడం, సాధారణ భూములను వివాదాస్పదంగా మార్చడం, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సస్పెన్షన్లకు గురికావడం వంటి పనితీరుతో పరాకాష్ట్రకు చేరుకుందని చెప్పవచ్చు. రెవెన్యూ అధికారుల పనితీరు ఇలా ఉండగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పనితీరు సైతం పోటీ పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి బద్వేల్ ఎమ్మెల్యే సుధ, ఎమ్మెల్సీ పిఆర్ మినహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేషన్ డైరెక్టర్లు గైర్హాజరయ్యారు. వేంపల్లి మండలంలో టెలికాం డిపార్టుమెంట్‌కు ఇచ్చిన 50 సెంట్ల స్థలంలో 20 సెంట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వెనక్కు తీసుకుని ఆర్టీసీ బస్టాండుకు, జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలో డిసిఇబి హాలుకు 10 సెంట్లు ఇస్తున్న తీర్మానాలను ఆమోదించడం గమనార్హం. ప్రజాశక్తి - కడప ప్రతినిధి
జిల్లా సర్వసభ్య సమావేశం నిట్టూర్పుల, నిరసనలు, ఆగ్రహాల మధ్య సాగిపోయింది. ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ సభ్యుల్లో నైరాశ్యం నెలకొంది. రెవెన్యూ మొదలుకుని విద్య, వైద్యం, మైనింగ్, ఆర్‌అండ్‌బి, హౌసింగ్ డిపార్టుమెంట్ల చుట్టూ కేంద్రీకృతమైంది. బి.మఠం ఎంపిపి వీరనారాయణరెడ్డి మాట్లాడుతూ తహశీల్దార్ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రెస్‌లుగా మారిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల అవినీతిని నిరుపిం చడానికి సిద్దంగా ఉన్నామని, మీరు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌ను కోరారు.. సామాన్య భూములను వివాదా స్పదంగా మార్చి తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మల్లేపల్లి రేషన్ డీలర్ 40 బస్తాల బియ్యం సహా దొరికిపోయి తొలగింపునకు గురయ్యారని, అటువంటి వ్యక్తిని మళ్లీ కొనసాగిండమేమిటని ప్రశ్నించారు. ఇటువంటి వివాదాస్పద తహశీల్దార్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సభ నుంచి వాకౌట్ చేస్తామని తీవ్రస్వరంతో హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకుని గత తహశీల్దార్‌ను బదిలీ చేశామని పేర్కొనగా వెండిపల్లెం నుంచి బంగారుపళ్లేనికి బదిలీ చేశారని, ఏమి లాభమని నిట్టూర్పులిచ్చారు. వీరపునాయునిపల్లి, కాశినాయన జడ్‌పిటిసిలు స్పందించి తహశీల్దార్ల ఇష్టారాజ్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, తమ తహశీల్దార్లు కూడా భూముల కేటాయింపులు, ఆన్‌లైన్ ఎక్కించడంలో అవినీతికి పాల్పడడంతో వ్యవస్థ దారుణంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. చక్రాయపేట మండల పరిధిలోని అద్దాలమర్రి, మాల్లెలమడక, గండికొవ్వూరు ప్రాంతాల్లో ఫిల్టర్ల ఆధారంగా వరి పంటను సాగు చేశారని, గండికొవ్వూరు సమీపంలోని ఇసుక క్వారీలో నిబంధనల్ని ఉల్లఘించి 10 మీటర్లకుపైగా ఇసుకను తోడేయడంతో ఫిల్టర్లు ఎండిపోతున్నాయని, క్వారీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వెలిగల్లు నీటిని విడుదల చేయాలని విజ్తప్తి చేశారు. వీరపునాయునిపల్లి సమీపంలోని జగనన్న లేఅవుట్‌కు ఇసుక కొరత ఏర్పడిందని, అతి సమీపంలోని ఇసుకను విస్మరించి, పులివెందుల ప్రాంతం నుంచి ఇసుకను రవాణా ఛార్జీలను భరించి తెచ్చుకోవాల్సి రావడంతో హౌసింగ్ పనులు భారంగా మారాయనే ఆందోళన వ్యక్తమైంది. పోరుమామిళ్ల జగనన్న కాలనీకి మట్టి, ఇసుక, రాయి కొరత ఏర్పడితుందని జడ్‌పిటిసి వాపోయారు. బి.మఠం మండలం సోమిరెడ్డిపల్లి, పలుగురాళ్లపల్లి పాఠశాలల ప్రధానో పాధ్యాయులు ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల పేర్లను నమోదు చేసి విద్యాబ్యాసం సాగిస్తున్నట్లు చూపు తుండడంపై ఆక్షేపించారు. డిఇఒ స్పందించి డిప్యూటీ డిఇఒతో కమిటీ వేశామని, నివేదిక అందిన వెంటనే చర్యలు తీసు కుంటామని తెలిపారు. బి.మఠం మండలంలోని ఉపాధ్యా యులు లెక్కచేయని ఎంఇఒను కలసపాడు మండలానికి డిప్యూటేషన్ వేయడమేమిటని ప్రశ్నించారు. కాశినాయన, బి.కోడూరు కెజిబివిలకు రక్షణ గోడలను ఏర్పాటు చేయడంలోని అధికారుల వైఫల్యాన్ని నిలదీశారు. వేంపల్లి హైస్కూల్ ప్రహరీ కూల్చి వేత, పెనగలూరు మండలంలోని ఎంఆర్‌పురం స్కూల్ ప్రహరీ ఏర్పాటు చేయకపోవడంతో దుర్బరంగా మారిందని సభ్యులు ఎత్తిచూపారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో అధికారుల దృష్టికి తీసుకెళ్దామనుకుని ఫోన్‌లు చేస్తే తహశీల్దార్లు మొదలు ఆర్‌డిఒ, హౌసింగ్ పీడీ స్థాయి అధికారులు కాల్స్ తీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గత సమావేశం నుంచి ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ దృష్టికి రహదారుల మరమ్మతుల అంశం తీసుకొస్తున్నప్పటికీ స్పందన లేదన్నారు. కాశినాయన మండలం నరసాపురం నుంచి ఉప్పలూరు రహదారి, 13 కి.మీ పొడవు కలిగిన బద్వేల్ నుంచి బిమఠం రహదారి అధ్వాన్నంగా ఉన్నాయని, మనుషులు మొదలుకుని వాహనాలు వెళ్లడానికి తీవ్రఇబ్బందులు పడాల్సివస్తోందన్నారు. ఆర్‌టిపిపి గొట్టాల నుంచి పొగల స్థానంలో బూడిద వస్తోందని, ఫలితంగా గ్రామాల్లో దుర్భర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదేమైనా బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధులు జిల్లా, మండల పరిషత్, జిల్లా రివ్వూ కమిటీ సమావేశాలకు గైర్హాజరు కావడం ప్రజల అభీష్టాన్ని నిర్లక్ష్యం చేయడమేననడంలో సందేహం లేదు.జడ్పీలో అవినీతి లొల్లిబజిల్లాలో రెవెన్యూ వ్యవస్థ పనితీరు అధ్వానంగా ఉందని, సంస్కరించని పక్షంలో వాకౌట్ చేసి వెళ్లిపోతామని హెచ్చరికల మధ్య జిల్లా పరిషత్ సమావేశం నడిచింది. జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు. భూములను ఆన్‌లైన్ చేయడం, సాధారణ భూములను వివాదాస్పదంగా మార్చడం, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సస్పెన్షన్లకు గురికావడం వంటి పనితీరుతో పరాకాష్ట్రకు చేరుకుందని చెప్పవచ్చు. రెవెన్యూ అధికారుల పనితీరు ఇలా ఉండగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పనితీరు సైతం పోటీ పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి బద్వేల్ ఎమ్మెల్యే సుధ, ఎమ్మెల్సీ పిఆర్ మినహా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేషన్ డైరెక్టర్లు గైర్హాజరయ్యారు. వేంపల్లి మండలంలో టెలికాం డిపార్టుమెంట్‌కు ఇచ్చిన 50 సెంట్ల స్థలంలో 20 సెంట్లు ఖాళీగా ఉన్న నేపథ్యంలో వెనక్కు తీసుకుని ఆర్టీసీ బస్టాండుకు, జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణంలో డిసిఇబి హాలుకు 10 సెంట్లు ఇస్తున్న తీర్మానాలను ఆమోదించడం గమనార్హం. ప్రజాశక్తి - కడప ప్రతినిధి

జిల్లా సర్వసభ్య సమావేశం నిట్టూర్పుల, నిరసనలు, ఆగ్రహాల మధ్య సాగిపోయింది. ఎన్నడూ లేని విధంగా అధికార పార్టీ సభ్యుల్లో నైరాశ్యం నెలకొంది. రెవెన్యూ మొదలుకుని విద్య, వైద్యం, మైనింగ్, ఆర్‌అండ్‌బి, హౌసింగ్ డిపార్టుమెంట్ల చుట్టూ కేంద్రీకృతమైంది. బి.మఠం ఎంపిపి వీరనారాయణరెడ్డి మాట్లాడుతూ తహశీల్దార్ కార్యాలయాలు అవినీతికి కేరాఫ్ అడ్రెస్‌లుగా మారిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారుల అవినీతిని నిరుపిం చడానికి సిద్దంగా ఉన్నామని, మీరు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌ను కోరారు.. సామాన్య భూములను వివాదా స్పదంగా మార్చి తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మల్లేపల్లి రేషన్ డీలర్ 40 బస్తాల బియ్యం సహా దొరికిపోయి తొలగింపునకు గురయ్యారని, అటువంటి వ్యక్తిని మళ్లీ కొనసాగిండమేమిటని ప్రశ్నించారు. ఇటువంటి వివాదాస్పద తహశీల్దార్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సభ నుంచి వాకౌట్ చేస్తామని తీవ్రస్వరంతో హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకుని గత తహశీల్దార్‌ను బదిలీ చేశామని పేర్కొనగా వెండిపల్లెం నుంచి బంగారుపళ్లేనికి బదిలీ చేశారని, ఏమి లాభమని నిట్టూర్పులిచ్చారు. వీరపునాయునిపల్లి, కాశినాయన జడ్‌పిటిసిలు స్పందించి తహశీల్దార్ల ఇష్టారాజ్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని, తమ తహశీల్దార్లు కూడా భూముల కేటాయింపులు, ఆన్‌లైన్ ఎక్కించడంలో అవినీతికి పాల్పడడంతో వ్యవస్థ దారుణంగా తయారైందని ఆందోళన వ్యక్తం చేశారు. చక్రాయపేట మండల పరిధిలోని అద్దాలమర్రి, మాల్లెలమడక, గండికొవ్వూరు ప్రాంతాల్లో ఫిల్టర్ల ఆధారంగా వరి పంటను సాగు చేశారని, గండికొవ్వూరు సమీపంలోని ఇసుక క్వారీలో నిబంధనల్ని ఉల్లఘించి 10 మీటర్లకుపైగా ఇసుకను తోడేయడంతో ఫిల్టర్లు ఎండిపోతున్నాయని, క్వారీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వెలిగల్లు నీటిని విడుదల చేయాలని విజ్తప్తి చేశారు. వీరపునాయునిపల్లి సమీపంలోని జగనన్న లేఅవుట్‌కు ఇసుక కొరత ఏర్పడిందని, అతి సమీపంలోని ఇసుకను విస్మరించి, పులివెందుల ప్రాంతం నుంచి ఇసుకను రవాణా ఛార్జీలను భరించి తెచ్చుకోవాల్సి రావడంతో హౌసింగ్ పనులు భారంగా మారాయనే ఆందోళన వ్యక్తమైంది. పోరుమామిళ్ల జగనన్న కాలనీకి మట్టి, ఇసుక, రాయి కొరత ఏర్పడితుందని జడ్‌పిటిసి వాపోయారు. బి.మఠం మండలం సోమిరెడ్డిపల్లి, పలుగురాళ్లపల్లి పాఠశాలల ప్రధానో పాధ్యాయులు ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న పిల్లల పేర్లను నమోదు చేసి విద్యాబ్యాసం సాగిస్తున్నట్లు చూపు తుండడంపై ఆక్షేపించారు. డిఇఒ స్పందించి డిప్యూటీ డిఇఒతో కమిటీ వేశామని, నివేదిక అందిన వెంటనే చర్యలు తీసు కుంటామని తెలిపారు. బి.మఠం మండలంలోని ఉపాధ్యా యులు లెక్కచేయని ఎంఇఒను కలసపాడు మండలానికి డిప్యూటేషన్ వేయడమేమిటని ప్రశ్నించారు. కాశినాయన, బి.కోడూరు కెజిబివిలకు రక్షణ గోడలను ఏర్పాటు చేయడంలోని అధికారుల వైఫల్యాన్ని నిలదీశారు. వేంపల్లి హైస్కూల్ ప్రహరీ కూల్చి వేత, పెనగలూరు మండలంలోని ఎంఆర్‌పురం స్కూల్ ప్రహరీ ఏర్పాటు చేయకపోవడంతో దుర్బరంగా మారిందని సభ్యులు ఎత్తిచూపారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో అధికారుల దృష్టికి తీసుకెళ్దామనుకుని ఫోన్‌లు చేస్తే తహశీల్దార్లు మొదలు ఆర్‌డిఒ, హౌసింగ్ పీడీ స్థాయి అధికారులు కాల్స్ తీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గత సమావేశం నుంచి ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ దృష్టికి రహదారుల మరమ్మతుల అంశం తీసుకొస్తున్నప్పటికీ స్పందన లేదన్నారు. కాశినాయన మండలం నరసాపురం నుంచి ఉప్పలూరు రహదారి, 13 కి.మీ పొడవు కలిగిన బద్వేల్ నుంచి బిమఠం రహదారి అధ్వాన్నంగా ఉన్నాయని, మనుషులు మొదలుకుని వాహనాలు వెళ్లడానికి తీవ్రఇబ్బందులు పడాల్సివస్తోందన్నారు. ఆర్‌టిపిపి గొట్టాల నుంచి పొగల స్థానంలో బూడిద వస్తోందని, ఫలితంగా గ్రామాల్లో దుర్భర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదేమైనా బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధులు జిల్లా, మండల పరిషత్, జిల్లా రివ్వూ కమిటీ సమావేశాలకు గైర్హాజరు కావడం ప్రజల అభీష్టాన్ని నిర్లక్ష్యం చేయడమేననడంలో సందేహం లేదు.