Sep 06,2023 20:13

ఎన్‌సిసికి ఎంపికైన విద్యార్థులతో హవల్దార్‌ మస్తాన్‌, సిపిఒ వెంకట గోపాల్‌

నిమ్మనపల్లి : నిమ్మనపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల (తెలుగు) లో జోరుగా ఎన్‌సిసి ఎంపికలను నిర్వహిస్తున్నట్లు ఉపాధ్యాయులు సిటిఒ వెంకటగోపాల్‌ తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవ త్సరాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల కషి ఫలితంగా నిమ్మనపల్లి జడ్‌పిహైస్కూల్‌ (తెలుగు)కు ఎన్‌సిసి యూనిట్‌ను చిత్తూరు ఎన్‌సిసి అధికా రులు మంజూరు చేశారన్నారు. మండల పరిధిలో మొట్టమొదటిసారిగా ఎన్‌సిసి అధికారుల ట్రైనింగ్‌ యూనిట్‌ ను మంజూరు చేయడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులందరూ హర్షం వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా ప్రధానోపాధ్యాయులు అంజాద్‌ అలీఖాన్‌, హవల్దార్‌ మస్తాన్‌, సిటిఒ వెంకటగోపాల్‌ ఆధ్వర్యంలో పాఠశాలలోని 8వ ,9వ తరగతిలోని విద్యార్థులకు ఎంపిక పోటీలను నిర్వహించామన్నారు. మొదటిరోజు 8వ తరగతిలో 50 మందిని, రెండవ రోజు 9వ తరగతిలో 50 మందిని, ఇప్పటి వరకు ఆసక్తి, అర్హత కలిగిన వంద మంది విద్యార్థులను ఎన్‌సిసి ట్రైనింగ్‌ కు ఎంపిక చేశామన్నారు. త్వరలోనే ఎన్‌సిసి అధికారులు, సిటిఒ వెంకటగోపాల్‌ ఆధ్వర్యంలో ఎన్‌సిసి శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.