Apr 25,2023 22:00

జడ్జి రత్నకుమార్‌ కుటుంబాన్ని సత్కరిస్తున్న న్యాయవాదులు, సిబ్బంది

ప్రజాశక్తి - గుంటూరు లీగల్‌ : జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జిగా పని చేసిన కె.రత్నకుమార్‌ విశాఖపట్నం 6వ అదనపు సివిల్‌ జడ్జిగా బదిలీపై వెళ్తున్న సందర్భంగా న్యాయసేవాధికార సంస్థ భవన్‌లో మంగళవారం ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రత్నకుమార్‌ మాట్లాడుతూ న్యాయసేవాధికార సంస్థ సిబ్బంది, ప్యానల్‌ న్యాయవాదులు, పారా లీగల్‌ వాలంటీర్లు, డిఫెన్స్‌ కౌన్సిలర్లు తనకు ఎంతో సహకరించారని గుర్తు చేసుకున్నారు. వారి సహకారం వల్లే సామాన్యుల కోసం ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించడానికి అవకాశం కలిగిందని చెప్పారు. కార్యాక్రమంలో న్యాయసేవాధికార సంస్థ సూపరింటెండెంట్‌ సుబ్బారావు, సిబ్బంది, ప్యానల్‌ న్యాయవాది కట్టా కాళిదాసు, డిఫెన్స్‌ కౌన్సిలర్లు జీవరత్నం, ఇల్లా మధుబాబు, పారాలీగల్‌ వాలంటీర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.