ప్రజాశక్తి-విజయవాడ అర్బన్: భగవాన్ మహావీర్ చూపిన అహింస బాటలోనే హొజైనులంతా పయనించడమే కాక సమాజాన్ని కూడా ఆ దిశగా చైతన్య పరుస్తున్నామని జైన్ సమాజ్ ఆర్గనైజేషన్ విజయవాడ శాఖ ప్రతినిధులు స్పష్టం చేశారు. జైనమతం 24వ తీర్థంకరుడైన మహావీరుని జయంతి వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బందావన్ కాలనీలోని ఎ కన్వెన్షన్ హాలులో జరిగిన ఈ వేడుకలను జైన ప్రముఖులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మహాసశతావధాని అభినందన చంద్ర సాగర్ మహారాజ్ వద్ద శిక్షణ పొందిన హొకవల బాలమునులు నమి చంద్రసాగర్, నెమి చంద్రసాగర్ సంయుక్తంగా శతావదాన ప్రక్రియను నిర్వహించారు. దాదాపు రెండు గంటల పైగా సాగిన ఈ హొఅవధాన ప్రక్రియ బాల సన్యాసుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. హిందీ, ఇంగ్లీష్, గుజరాతి, భాషలలో పశ్చకులు అడిగిన ప్రశ్నలకు బోధకులు సునాయాసంగా సమాధానాలు ఇస్తూ సబికులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ సందర్భంగా విజయవాడ జైన్ సమాజ్ ప్రతినిధులు ప్రవీణ్ జైన్, సంజరు కుమార్ మెహతా జైన్, నరేంద్ర సోలంకి, దినేష్ జైన్, మహేందర్ జైన్ మనోజ్ కొఠారి పభతులు మాట్లాడుతూ మహావీరుడు బోధించిన బ్రతుకు బ్రతికించు అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమ జైన సమాజం పని చేస్తోందన్నారు. సృష్టిలో నివసించే హొఏ జీవికి కూడా హింసించకుండా హాని తలపెట్టకుండా జీవించాలని, ఆ దిశగా సమాజాన్ని చైతన్య పరుస్తున్నట్లు తెలిపారు.హొ










