ఆదివాసుల కోసం జీవితమంతా వెచ్చించిన 84 సంవత్సరాల వృద్ధుడు, జెసూయిట్ ఫాదర్ స్టాన్ స్వామి. తన సహ జెసూయిట్ ఫాదర్ జోసెఫ్ గ్జేవియర్‌కు తలోజా జైలు నుంచి రాసిన ఉత్తరంలో రాసిన కవిత ఇది :
భయపెట్టే చెరసాల సింహద్వారం దాటగానే
అతి కనీస అవసరాలు మినహా
నీ సొంత వస్తువులన్నీ లాగేసుకుంటారు
ప్రతి నోటా మొదట వచ్చే మాట ''మీకు''
ఆ తర్వాతే వెలువడుతుంది ''నాకు''
ప్రతి ఒక్కరూ పీల్చే గాలి ''మనది''
నాదంటూ ఏమీ లేదు
నీది కూడ ఏదీ లేదు
ప్రతి ఒక్కటీ మనందరిదీ
మిగిలిపోయిన ఆహారం పారవేయడం జరగదిక్కడ
అదంతా ఆకాశంలో గిరికీలు కొట్టే పక్షులతో పంచుకునేదే
అవి గబుక్కున దిగి, కడుపు నింపుకుని, సంతోషంగా ఎగిరిపోతాయి
ఎందరెందరో యువకుల ముఖాలు చూసి దిగులు వేస్తుంది
''ఎందుకొచ్చారిక్కడికి?'' అని అడుగుతాను
తడబాటు లేకుండా తమ గాథలు వినిపిస్తుంటారు
ప్రతి ఒక్కరూ శక్తి కొద్దీ పనిచేయాలి
ప్రతి ఒక్కరికీ అవసరం కొద్దీ అందుతుంది
సోషలిజం అంటే అదే గదా
ఓV్‌ా, ఈ సమష్టితత్వం బలవంతాన రుద్దబడింది
మనుషులందరూ స్వేచ్ఛగా, ఇష్టంగా ఇది అందుకుంటే..
మనందరమూ నిజంగా భూమితల్లి బిడ్డలమే అయిపోమూ...
- ఫాదర్ స్టాన్ స్వామి
తెలుగు అనువాదం: ఎన్ వేణుగోపాల్