Aug 22,2022 23:05

సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్న కెకె.రాజు తదితరులు

ప్రజాశక్తి-సీతమ్మధార : జివిఎంసి 48వ వార్డు పరిధి జైభారత్‌నగర్‌ ప్రాంతంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఉత్తర నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త కెకె.రాజు, 48వ వార్డు వైసిపి ఇన్‌ఛార్జి నీలి రవితో కలిసి ఇంటింటికీ వెళ్లి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రజల సమస్యలనడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కె.కె రాజు మాట్లాడుతూ, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, చివరి లబ్ధిదారుని వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా ప్రజా ప్రతినిధులు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ కటుమూరి సతీష్‌, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ అల్లు శంకరరావు, నాయకులు కిరణ్‌ రాజు, కెపి.రత్నాకర్‌, ఆళ్ల శివగణేష్‌, రాయుడు శ్రీను, కర్రి రామారెడ్డి, పి.పద్మ, పి.అప్పారావు, నరేష్‌, శ్రీరామ్‌, హేమంత్‌, జయ, భారత్‌, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.