May 13,2023 22:48

గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం

జై జవాన్‌ - జై కిసాన్‌ పై విద్యార్థులకు అవగాహన
ప్రజాశక్తి - పెద్దాపురం
స్థానిక శాఖా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞానశిబిరంలో శనివారం దేశ రక్షణ కోసం సైనికులు నిర్వ హిస్తున్న పాత్ర, దేశ ప్రజలందరికీ ఆహారం అందించ డంలో రైతులు చేస్తున్న కృషి వంటి అంశాలపై వాడపల్లి విమలా రాణి, సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ జోష్యుల కృష్ణ బాబు నీతి పద్యాలపై, సాహితీ స్రవంతి పట్టణ కార్య దర్శి కొత్త శివ తెలుగు వ్యాకరణంపై విరించారు. గ్రంథాల యాధికారి పాలంకి నాగ రాజు, సిబ్బంది సింగం బుల్లయ్య, మరియమ్మ, పాఠకులు పాల్గొన్నారు.