Apr 21,2023 00:22

పొన్నూరు రూరల్‌: బిజెపి నిరంకుశ పాల నకు నిరసనగా ఈనెల 24న విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌ లో జరిగే జై భారత్‌ సత్యాగ్రహ సభను జయప్రదం చేయాలని ఏఐసీసీ సెక్రటరీ ,కాంగ్రెస్‌ పార్టీ గుజరాత్‌ రాష్ట్ర ఇంచార్జి గేరా ఉషారాణి నాయుడు పిలుపు నిచ్చారు. స్థానికంగా ఆమె స్వగహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్లమెంటులో అధికార పార్టీ బిజెపి వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచే విధంగా ఉందని విమర్శించారు. దేశవ్యాప్తంగా నిత్యవసర వస్తువులు పెట్రోలు గ్యాస్‌ తదితర వస్తువుల ధరలు తదితరల ధరలు ఆకాశాన్ని అంటడంతో సామాన్యుడి బతుకు అగమ్య గోచరంగా మారిందని అన్నారు. మోడీని గద్దె దించే వరకూ ప్రజలను చైతన్య పరుస్తూ తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. జై భారత్‌ సత్యాగ్రహ సభ ను జయప్రదం చేయాలని కోరుతూ వాల్‌పోస్టర్‌ను ఆమె విడుదల చేశారు.సమావేశంలో పిసిసి జనరల్‌ సెక్రెటరీ జగన్మోహన్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు సిటీ బిసి సెల్‌ సెక్రెటరీ డి కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.