Nov 04,2022 21:24

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
               జిల్లా జాయింట్‌ కలెక్టర్‌, ఐటిడిఎ ఇన్‌ఛార్జి పిఒ అరుణ్‌బాబు శుక్రవారం మండలంలో పర్యటించి తనిఖీలు చేశారు. పులిరామన్నగూడెం ఆసుపత్రిని తనిఖీ చేశారు. నూతన సచివాలయాన్ని పరిశీలించారు. అనంతరం ముంజులూరులోని పాఠశాలను పరిశీలించారు. ఏజెన్సీ ప్రాంతంలో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న ముంజులూరు వాటర్‌ ఫాల్స్‌ను సందర్శించారు. కన్నాపురం రోడ్డులోనీ అల్లికాలువ వద్ద నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ హాస్పటల్‌ పనులను జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలించారు.