Jan 30,2023 23:18

మహాత్మా గాంధీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న పాడేరు పిఒ

ప్రజాశక్తి-పాడేరు టౌన్‌: జాతిపిత మహాత్మాగాంధీ 75వ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం ఐటిడిఎ కార్యాలయ సమావేశ మందిరంలో గాంధీజీ చిత్రపటానికి ఐటిడిఎ పిఒ రోణంకి గోపాలకృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ అహింసే ఆయుధంగా, బ్రిటీషర్లపై పోరాటం చేసి, భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించడంలో గాంధీజీ కృషిని కొనియాడారు. కార్యక్రమంలో ఐటిడిఎ పరిపాలనాధికారి హేమలత, డిపిఒ కొండలరావు, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఇఇ పి.లీలాకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
డుంబ్రిగూడ : మహాత్మాగాంధీ వర్థంతిని పురస్కరించుకుని మండలంలోని కోసంగుడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు విలియం కేరి ఆధ్వర్యంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గాంధీజీతోపాటు స్వాతంత్య్ర సమరయోధులు, ముఖ్యనేతల జీవిత చరిత్రను విద్యార్థులు తెలుసుకోవాలన్నారు.గాంధీజీ ఆశయసాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సీలేరు: సీలేరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి ఎంపిటిసి పిల్ల సాంబమూర్తి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేత కారే శ్రీనివాస్‌ కార్యకర్తలు చెల్లు శ్యామ్‌సన్‌, వర్తక సంఘం అధ్యక్షులు సిద్ధు, సీలేరు క్రీడాకారుడు జాన్‌బాబు, ఎం.రమణ ఎపి జెన్‌కో కార్మికులు, కాంట్రాక్ట్‌ కార్మికులు లక్ష్మణ్‌, వైసిపి కార్యకర్తలు, ఎస్‌సి అసోసియేషన్‌ నాయకులు బాలకోటయ్య, విజరు పాల్గొన్నారు.
రంపచోడవరం : మండలంలోని తామరపల్లి సచివాలయంలో గాంధీజీ చిత్రపటానికి ఎంపిటిసి వంశి కుంజం, సర్పంచ్‌ మిర్తివాడ ఆనంద్‌ రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ముసురిమిల్లి వార్డు సభ్యులు ప్రసాద్‌, చిట్టిదొర, వైసిపి నేతలు వి.వెంకన్న, సెక్రటరీ కృష్ణమోహన్‌, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు
రాజవొమ్మంగి : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం వద్ద గాంధీజీ చిత్రపటానికి ఎంపిపి గోము వెంకటలక్ష్మి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పూలమాలలువేసి ఘన నివాళులర్పించారు. ఇఒపిఆర్‌డి శ్రీనివాసరావు, సీనియర్‌ అసిస్టెంట్‌ జయంతి, వెలుగు ఎపియం ఆదినారాయణ, వెలుగు సిసిలు, కార్యాలయ సిబ్బంది, ఉపాధి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.